వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీఆర్వో పరీక్షలో మహిళలకు అవమానం: పుస్తెలు తీయించడంపై గవర్నర్ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

నర్సాపూర్: రెండు రోజుల క్రితం (ఆదివారం) మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వీఆర్వో పరీక్ష కేంద్రం వద్ద అధికారులు అత్యుత్సాహం ప్రదర్సించారు. మహిళలను దారుణంగా అవమానించారు. వివాహితలు పుస్తెలు, మెట్టెలు తీస్తేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని ఆంక్షలు విధించారు. దీంతో చేసేదేమీ లేక మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసి పరీక్ష రాసేందుకు వెళ్లారు.

విషయం తెలియడంతో పలువురు పరీక్షా కేంద్రాల వద్ద నిరసన తెలిపారు. పుస్తెలు, మెట్టెలు వేసుకొని పరీక్ష రాయడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించారు. ఇది తీవ్ర దుమారం రేపడంతో పాటు పైగా మహిళలను అవమానించేదిగా ఉంది. దీనిపై విచారణకు ఆదేశించారు.

వింత అనుభవంపై ఆగ్రహం

వింత అనుభవంపై ఆగ్రహం

నర్సాపూర్‌లోని ఓ సెంటర్లో మహిళలకు ఈ వింత అనుభవం ఎదురైంది. అధికారుల వింత కండిషన్ పైన అందరూ నోరెళ్ల పెడుతున్నారు. పుస్తెలు తీస్తేనే పరీక్షకు అనుమతిస్తామటూ ఆంక్షలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఇలా పుస్తెలు తీయించడం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గవర్నర్ ఆగ్రహం

గవర్నర్ ఆగ్రహం


వీఆర్వో పరీక్ష సమయంలో కొంతమంది మహిళలు ఇబ్బందులు పడ్డారని మెదక్ జిల్లా కలెక్టర్ రిపోర్ట్ పంపించారని తెలుస్తోంది. పరీక్ష కేంద్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ఆదేశించారు. కాగా, ఈ అంశంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఘటనకు బాధ్యులెవరు

ఘటనకు బాధ్యులెవరు

ఈ ఘటనకు బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూనే వివరణ ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను గవర్నర్ ఆదేశించారని తెలుస్తోంది. దీంతో టీఎస్పీఎస్సీ ఒక నివేదికను రాజభవన్‌కు పంపించిందని తెలుస్తోంది. ఈ ఘటనకు అయా పరీక్షా కేంద్రాల నిర్వాహకులే బాధ్యులని నివేదికలో పేర్కొన్నారని సమాచారం. టీఎస్పీఎస్సీ సెక్రటరీ వాణీప్రసాద్‌ వివరణ ఇచ్చారు. మహిళా అభ్యర్థులు మంగళసూత్రాలు తీసి రావాలనే నిబంధనను తాము విధించలేదన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో మంగళసూత్రాలు తీసి రావాలని సిబ్బంది ఆదేశించినట్లు వార్తలు రాగానే స్పందించామని చెప్పారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. కొందరితో మాత్రమే మంగళసూత్రాలు తీయించినట్లు తేలిందన్నారు. కేంద్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.

హెచ్చార్సీలో ఫిర్యాదు

హెచ్చార్సీలో ఫిర్యాదు

వీఆర్వో పరీక్షల్లో సిబ్బంది వ్యవహరించన తీరుపై పలువురు నాయకులు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. పరీక్షకు హాజరైన మహిళలు తాళిబొట్టు, మెట్టెలు, గాజులు తీయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిబ్బంది వ్యవహరించిన తీరు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

English summary
In a repeat of scenes displayed outside the exam centers during NEET exam, women candidates appearing for the Village Revenue Officers (VROs) on Sunday at Little Flower High School in Narsapur, Medak district as their exam center, faced anxious movements as they were forced to remove their ornaments. Some married women appearing for the exam got furious as they were told to remove their mangalsutras.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X