వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం... ఉద్యోగం నుంచి తొలగించడంతో టెక్కీ ఆత్మహత్య... కుప్పకూలిన తల్లిదండ్రులు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. తనను ఉద్యోగం నుంచి తొలగించారన్న మనస్తాపంతో ఓ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మంగళవారం(సెప్టెంబర్ 22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే... భువనగిరి పట్టణానికి చెందిన అభిలాష్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వర్క్ హోమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కంపెనీ నుంచి అభిలాష్‌కి ఓ సమాచారం అందింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

Worried over losing job, techie commits suicide in bhongir

ఇదే క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లోనే తన చేతి మణికట్టును కత్తితో కోసుకుని... ఆపై సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న కొడుకును చూసి అభిలాష్ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఒక్కగానొక్క కొడుకు చేతికి అందివచ్చాడనుకుంటున్న తరుణంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఇలా అన్యాయం చేసి వెళ్లిపోయావా అని రోధిస్తున్నారు. కొడుకు ఆత్మహత్యతో షాక్ తిన్న అభిలాష్ తల్లి స్పృహ కోల్పోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ దంపతులను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది.

మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అభిలాష్ మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అభిలాష్‌ను జాబ్‌ నుంచి తొలగించడంపై ఆ కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి వివరాలు కోరే అవకాశం ఉంది.

Recommended Video

TDP Leader Arvind Kumar Gowda Slams Telangana MP's Response Over Rains

కరోనా లాక్ డౌన్ చాలా రంగాలపై ప్రభావం చూపించడంతో ఎంతోమంది ఉద్యోగ,ఉపాధి కోల్పోయిన పరిస్థితి. లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో కేరళకు చెందిన జీనమోల్ జోసెఫ్(25) అనే యువ ఐటీ ఉద్యోగి కూడా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం పోయినందుకు ఆత్మహత్యకు పాల్పడింది. ఇక అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు,వలస కూలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నది.

English summary
Worried about losing his job, Abhilash a software employee from Bhongir, working in a Bengaluru company, committed suicide at his home on Tuesday Morning. The police registered a case and have taken up the investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X