వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి కాలేదనే డిప్రెషన్ .. రైలు పట్టాలపై తలపెట్టి ప్రాణం తీసుకున్న యువకుడు

|
Google Oneindia TeluguNews

పెళ్లి కావడం లేదని ఆత్మన్యూనతాభావం ఒక వ్యక్తి ప్రాణం తీసింది. వివాహం కావట్లేదనే బాధతో వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
తన పెళ్లి గురించి కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోవడం లేదని దీంతో తన వయసు పెరుగుతున్నా తననెవరూ పెళ్లి చేసుకోవడం లేదని ఆవేదన చెందిన వ్యక్తి అందరూ చూస్తుండగా రైలు పట్టాలపై తలపెట్టి తిరిగిరాని లోకాలకు చేరిపోయాడు.

పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగించే మహమ్మద్‌ సాబేర్‌(31) పెళ్లి కాట్లేదని నెక్లెస్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. నక్లెస్ రోడ్ లోని ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగా ఊహించని విధంగా రైలు వస్తుండగా రైలు పట్టాలపై తలపెట్టి ప్రాణాలు విడిచాడు.

పీకల దాకా తాగి పెళ్లి పీటల మీదికొచ్చిన వరుడు... పెళ్ళికి నిరాకరించిన వధువు పీకల దాకా తాగి పెళ్లి పీటల మీదికొచ్చిన వరుడు... పెళ్ళికి నిరాకరించిన వధువు

Worry about marriage cause Depression.. Hyderabad man to commit suicide

ఎంఎస్‌మక్తాకు చెందిన షేక్‌ హైదర్‌కు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మహమ్మద్‌ సాబేర్‌(31) హైదర్‌కు రెండవ కొడుకు.అయితే ఇద్దరు అక్కలు, అన్న, ఇద్దరు తమ్ముళ్లకు పెళ్లిళ్లు చేసి, సాబేర్‌ తల్లిదండ్రులు చనిపోయారు. అయితే సాబేర్ పెళ్లి గురించి కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో స్నేహితుల వద్ద బాధపడేవాడు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో నెక్లెస్‌ రోడ్డులోని ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుని, ఎంఎంటీఎస్‌ రైలు సమీపంలోకి రాగానే పరిగెత్తి వెళ్లి పట్టాలపై తలపెట్టాడు. అందరూ చూస్తుండగానే అతని తల, మొండెం రెండుగా విడిపోయాయి. అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు .

English summary
Depressed over not getting married, a 31-year-old man committed suicide by jumping in front of the train . According to Nampally police, Mohammad Saber, a resident of MS Maqta was depressed over his marriage. After his parents' death, Saber had been staying alone and often worried about his marriage before his friends. On Friday, Saber along with his friends went to MMTS railway station at Necklace Road. Noticing a train arriving at the station, Saber jumped in front of it and succumbed to serious injuries and he died .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X