వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాహ్.. క్యా సీన్ హై.. పార్లమెంటుకు తండ్రీ కొడుకులు..! కేసీఆర్ పై మండిపడ్డ ఎంపీ అర్వింద్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వాహ్.. క్యా సీన్ హై.. పార్లమెంటుకు తండ్రీ కొడుకులు..! || Oneindia Telugu

ఢిల్లీ/హైదరాబాద్ : చట్ట సభల్లో కొన్ని అపురూప ఘట్టాలు చోటుచేసుకుంటాయి. అవి కొన్ని అనుకోని జరిగితే మరి కొన్ని యాదృచ్చికంగా జరిగిపోతుంటాయి. కొన్ని సందర్బాల్లో తల్లి కొడుకు, తండ్రి కూతురు, తండ్రి కొడుకూ కలిసి చట్టసభలకు ప్రాతినిద్యం వహిస్తుంటారు. ఇలాంటి సందర్బాలు అరుదుగా కనిపించినా చట్టసభల వేదికల మీది వీరు తారసపడినప్పుడు చూడముచ్చటగా ఉంటుంది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ తండ్రీ కొడుకులు కూడా పార్లమెంట్ కు కలిసి వచ్చి కాసేపు అందనిరి అలరించినట్టు తెలుస్తోంది.

ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడు. ఆయన తనయుడు ధర్మపురి అర్వింద్ లోక్ సభ సభ్యుడు. ఇద్దరు పార్లమెంటు సమావేశాలకు హాజరై వస్తున్న దృశ్యాన్ని ఒక అభిమాని క్లిక్ కొట్టారు. టీఆర్ఎస్ నుంచి డీఎస్ రాజ్యసభ సభ్యత్వం రాగా, మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున నిజామాబాద్ నుంచి ఆయన తనయుడు అర్వింద్ గెలుపొందారు. బుధవారం తండ్రి, తనయుడు ఇద్దరూ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు.

Wow..Kya Sean Hai.!Father and son in Parliament..! MP Arvind fired over KCR .. !!

మంగళవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి బీజేపీ ఎంపీలకు ఆహ్వానం పంపకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఎంపీ అర్వింద్ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులిచ్చింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పరిపాలనలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల మునకకు గురైన 27% భూమి మహారాష్ట్ర కు చెందినదే. కేంద్రం వివిధ పథకాల కింద రాష్ట్రానికి పంపించిన నిధులను ఈ ప్రాజెక్ట్ కు మళ్లించారు.

ఈ విధంగా భూమి, నిధులు, అనుమతులు బీజేపీ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం కోసం బహుమతిగా ఇస్తే, బీజేపీ ఎంపీలను కనీసం ప్రారంభోత్సవానికి పిలవాలన్న కనీస మర్యాదను పాటించక పోవడం శోచనీయమన్నారు. ఈ ఒంటెద్దు పోకడలను, అహంకారాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందుకే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. ఇదే విధంగా కొనసాగితే, మరిన్ని గుణపాఠాలు నేర్చుకోడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉండాలని అర్వింద్ హెచ్చరించారు.

English summary
Dharmapuri Srinivas is a member of the Rajya Sabha. His son Dharmapuri Arvind is a member of the Lok Sabha. A fan clicked on the scene attending two parliamentary sessions. While his son Arvind won the Nizamabad on behalf of the BJP in the recent elections, Srinivas was a member of the Rajya Sabha from the TRS. On Wednesday, both father and son attended parliamentary sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X