వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా రోగి మృతదేహం మారింది, శ్మశానంలో గుర్తించిన భార్య, అంబులెన్స్‌లో తిరిగి గాంధీకి...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 నోడల్ ఆస్పత్రిగా గాంధీ దవాఖాన పనిచేస్తుంది. వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి ఉంది. దీంతో మంగళవారం చనిపోయిన ఓ రోగికి బదులు మరో రోగి శవాన్ని బంధువులకు అప్పగించారు. అక్కడినుంచి శ్మశానం తీసుకెళ్లాక.. మొహాం చూసి గుర్తించారు. వెంటనే అంబులెన్స్‌లో గాంధీ మార్చురీకి చేరుకున్నారు. అయితే అక్కడ వారికి కావాల్సిన శవం ఉండటంతో శాంతించారు.

రణరంగంగా గాంధీ ఆసుపత్రి: రోడ్డెక్కిన జూనియర్ డాక్టర్లు: రాత్రి నుంచీ: కేసీఆర్ రావాలంటూరణరంగంగా గాంధీ ఆసుపత్రి: రోడ్డెక్కిన జూనియర్ డాక్టర్లు: రాత్రి నుంచీ: కేసీఆర్ రావాలంటూ

హైదరాబాద్ బేగంపేట గురుమూర్తినగర్‌కి చెందిన ఓ రోగి మంగళవారం గాంధీ ఆస్పత్రిలో చనిపోయారు. తర్వాత ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అక్కడినుంచి నేరుగా శ్మశానానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆయన భార్య మృతదేహాన్ని గుర్తించారు. శవం తన భర్తది కాదని చెప్పడంతో... అదే అంబులెన్స్‌లో తిరిగి గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

Wrong body given to COVID-19 victim’s family in gandhi hospital

Recommended Video

KTR Attended To 'Wings India 2020' Meeting In Hyderabad ! || Oneindia Telugu

అక్కడ వైద్యులు, సిబ్బందితో గొడవపడ్డారు. మృతదేహాం ఎలా మార్చారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మార్చురీలో వారికి కావాల్సిన మృతదేహం కనిపించింది. దీంతో వారు శాంతించారు. వాస్తవానికి గాంధీలో కరోనా వైరస్ సోకిన రోగులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. దీంతో వైద్యులు, సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. దీంతో మృతదేహాం మారింది. మరోవైపు బుధవారం వారికి సరైన మృతదేహాం ఇవ్వడంతో తీసుకెళ్లి.. అంత్యక్రియలు నిర్వహించిట్టు తెలిసింది.

English summary
Mild tension prevailed on Wednesday at Begumpet in Telangana, after somebody else’s body was handed over to a family who had lost their relative to COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X