వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. వటపత్ర సాయిగా దర్శనం కమనీయం .. నేడు గోవర్ధనధారిగా స్వామి

|
Google Oneindia TeluguNews

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు పూర్తి చేసుకున్నాయి. ఐదో రోజు స్వామి వారు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వటపత్ర సాయి సందర్శనం నయనానందకరంగా సాగింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వేద పండితులు వేద పఠనం తో, అర్చకుల మంత్రోచ్ఛారణలతో, ఋత్విక్కుల వేద పారాయణలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఓం నమో నరసింహాయ అంటూ భక్త జనులు స్వామివారికి జయజయ ధ్వానాలు పలికారు .

యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. కృష్ణావతారంలో ఊరేగిన స్వామి ... నేడు వటపత్ర సాయిగా దర్శనంయాదాద్రి బ్రహ్మోత్సవాలు .. కృష్ణావతారంలో ఊరేగిన స్వామి ... నేడు వటపత్ర సాయిగా దర్శనం

వటపత్రసాయికి వరహాల లాలి ... నయనానందకరంగా వటపత్రశాయి దర్శనం

వటపత్రసాయికి వరహాల లాలి ... నయనానందకరంగా వటపత్రశాయి దర్శనం

బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున శ్రీ లక్ష్మీ నరసింహుడు వటపత్రశాయిగా వటపత్ర శయనుడు భక్తులకు కనువిందు చేశాడు. యావత్ జగత్తు అంతా నిండి ఉంది తానేనని తనలోనే ప్రకృతి అంతా కలదని, అందుకే వటపత్రములను అలంకారంగా చేసుకున్న స్వామి వటపత్ర సాయిగా భక్తులను కరుణించాడు. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి అంటూ స్వామివారిని బాలాలయం నుండి ముఖ మండపం వరకు ఊరేగింపు నిర్వహించారు . వటపత్ర శయనుడిగా శ్రీ లక్ష్మీ నరసింహుడు ఉదయం భక్తులకు దర్శనమిచ్చాడు.

 రాత్రి ఘనంగా స్వామి పొన్నవాహన సేవ

రాత్రి ఘనంగా స్వామి పొన్నవాహన సేవ


ఇక రాత్రి వేళ కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షమును తన వాహనంగా చేసుకుని రాత్రి బాలాలయంలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామి. ఒక్కోరోజు ఒక్కో అలంకారం లో స్వామి దర్శనం చూస్తున్న భక్తులు తరించిపోతున్నారు. ఇక శ్రీ వారు తమ ఇష్ట వాహనాలపై ఊరేగుతూ యాదాద్రి కొండపైన భక్తులకు ప్రతి నిత్యం దర్శనమిస్తున్నారు . శ్రీదేవి, భూదేవి ,ఉభయ దేవేరులతో స్వామి వారు కల్పవృక్ష వాహనంపై ఉత్సవమూర్తిగా కనువిందు చేశారు.

నేడు గోవర్ధనగిరిధారిగా స్వామి.. రాత్రికి సింహవాహన సేవ

నేడు గోవర్ధనగిరిధారిగా స్వామి.. రాత్రికి సింహవాహన సేవ

బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన నేడు స్వామి వారు గోవర్ధనగిరిధారిగా దర్శనమివ్వనున్నారు .ఇక రాత్రి వేళ సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగించనున్నారు . అంతేకాదు నేటి నుండి ధార్మిక, సంగీత, సాహిత్య మహాసభలు యాదాద్రి వేదికగా బ్రహ్మోత్సవాలలో భాగంగా జరగనున్నాయి. ఇప్పటికే బ్రహ్మోత్సవాల కైంకర్యాల లో భాగంగా నిత్య హోమాలు, చతుర్వేద పారాయణలు, మూల మంత్ర పఠనాలు, ఇక స్వామివారికి నిర్వహించే అలంకరణ సేవ ముందు ప్రబంధ పారాయణం నిర్వహిస్తున్నారు. నేడు ఉదయం 11 గంటలకు గోవర్ధన గిరిధారిగా స్వామివారి అలంకరణ జరగనుంది. రాత్రి 9 గంటలకు సింహ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహుడు పురవీధుల్లో ఊరేగనున్నాడు.

English summary
Brahmotsavam of Sri Laksmi Narasimha Swamy temple Yadadri formally begun with the chanting of ‘swasthi vacahanams’ by priests on Yadadri hill shrine .Amid rituals and chanting of veda mantras by the temple priests, brahmotsavam is performing . On fifth day swami appeared in "Vatapathra sai avataram" .Toady swami appearing in "Govardhanadhaari " alankaram to the piligrims .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X