వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుందరీకరణతో యాదాద్రికి నూతన శోభ .. ఏకతల విమాన గోపురాల పనులు ప్రారంభం 

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం శరవేగంతో జరుగుతోంది. అద్భుత శిల్పకళా ప్రతిభతో శిల్పులు సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. మనోహరమైన శిల్ప సంపదకు, ఆధ్యాత్మికత ఉట్టిపడే రూప నిర్మాణాలకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నెలవుగా మారనుంది.

జీవకళ ఉట్టిపడేలా శిల్ప నిర్మాణం... సర్వాంగ సుందరంగా యాదాద్రి దేవాలయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా నూతన ప్రధానాలయంలో సప్త రాజగోపురం నిర్మాణాలు పూర్తయ్యాయి. గర్భాలయంపైన గల శిల్ప ఆకృతులు, ముఖమండపం వద్ద గల శంఖు, చక్ర నామాలు ఎంతో అద్భుతంగా రూపొందుతున్నాయి. ఆంజనేయ, గరుడ ఆళ్వారుల ప్రతిమలతో గుడిలో పునర్నిర్మాణ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధికి వస్తేనే భక్త జనులకు నేత్రానందం కలిగేలా, మానసిక ప్రశాంతత నెలకొనేలా నిర్మాణ శైలి కనిపిస్తుంది.సుదర్శన విమాన రాజగోపురంపై దేవతా విగ్రహాలలో జీవకళ ఉట్టి పడుతుంది. 10 ద్వారపాలకుల విగ్రహాలు, ప్రతి అంతస్తులో రెండు చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తం 10 విగ్రహాల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండపం, ప్రాకార భాగాల్లో విమాన గోపుర అమరిక పనులు జరుగుతున్నాయి.

Yadadri is getting more beautiul with the beautification .. Ekatala vimana gopura works are started

అద్భుతమైన రాజగోపురాల నిర్మాణ నైపుణ్యం ... ఏకతల విమాన గోపురాల బిగింపు పనులు ప్రారంభం

అద్భుత శిల్పకళా నైపుణ్యంతో రాజ గోపురాల నిర్మాణాన్ని పూర్తి చేసిన శిల్పులు ఆలయ పైకప్పు భాగంలో పుష్ప ఆకార నిర్మాణాలు చేపడుతున్నారు. గరుడ మందిరాన్ని ముఖమండపంలో పడమటి దిశగా కడుతున్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం దూరం నుంచే ప్రాప్తించేలా నిర్మాణపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు . గుడి నలువైపుల నిర్మించే అష్టభుజ మండప ప్రాకారాలకు సంబంధించి ఏక తల విమాన గోపురాలు బిగింపు పనులు ప్రారంభమయ్యాయి. గుడి నలువైపులా 24 విమాన గోపురాలు ఆవిష్కృతం కానున్నాయి. కృష్ణ శిలతో చాలా అద్భుతంగా యాదాద్రి దేవాలయ నిర్మాణం గతంలో ఎవరూ చేయని విధంగా రూపు దిద్దుకుంటుంది . అహర్నిశలు శ్రమిస్తూ శిల్పులు తమ ప్రతిభను చాటిచెప్పేలా అద్భుతంగా నిర్మిస్తున్నారు.యాదాద్రి దేవాలయాన్ని అంతర్జాతీయంగా ప్రత్యేక స్థానంలో నిలబెట్టేలా ప్రయత్నం చేస్తున్నారు.

English summary
The wait for darshan at Sri Lakshmi Narasimha Swamy Temple, atop Yadadri, will soon be over as works pertaining to the main temple complex, construction of seven gopurams has completed and now "ekatala vimana gopura" works are started and the 24 vimana gopura fitting works will be completed soon . In its attempt to give a tribute to the wisdom of ancient Indian architecture
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X