హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాధవి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద వైద్యులు: తల్లి, తమ్ముడిని చూడాలని..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వేరే కులానికి చెందిన యువకుడ్ని ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో బుధవారం దాడికి గురై.. ప్రాణాలతో పోరాడుతున్న మాధవి హెల్త్‌ బులిటెన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. గురువారం వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. మాధవి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు.

మరో 48 గంటల తర్వాత జనరల్‌ వార్డుకు తరలిస్తామని తెలిపారు. తండ్రి ఇంత దారుణంగా దాడి చేయడంతో ఆమె తీవ్ర షాక్‌కు గురైందన్నారు. తన తల్లి.. తమ్ముడిని చూడాలని కోరిందని చెప్పారు. ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉండటంతో ఎక్కువ మందిని చూడటానికి అనుమతిని ఇవ్వటంలేదని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

నా కూతురుపై అందుకే దాడి చేశా, ఆవేశంలోనే..: మనోహారాచారి, 'కూతురే టార్గెట్- ఇప్పుడు బాధపడితే' నా కూతురుపై అందుకే దాడి చేశా, ఆవేశంలోనే..: మనోహారాచారి, 'కూతురే టార్గెట్- ఇప్పుడు బాధపడితే'

Yashoda Hospital Doctors Release Madhavi Health Bulletin

దాడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు వారం రోజుల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహరాచారి.. కొత్తబట్టలు పెడతానని నమ్మించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ముందుగా సందీప్‌పై దాడి చేశాడు.

ఎర్రగడ్డ ప్రేమజంటపై దాడి: ఆ కిరాతక తండ్రిని ఎగిరితన్నిన యువకుడు! ఎర్రగడ్డ ప్రేమజంటపై దాడి: ఆ కిరాతక తండ్రిని ఎగిరితన్నిన యువకుడు!

ఆ తర్వాత మాధవి అడ్డుకోవడంతో ఆమెను విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మాధవికి తీవ్రగాయాలయ్యాయి. ఓ చేయికి లోతుగా కత్తి గాటు పడింది. మెడపై దాడి చేయడంతో కొన్ని నరాలు ఛిద్రమైనట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం కోరుకుంటోందని తాజాగా వైద్యులు తెలిపారు.

English summary
Secunderabad Yashoda Hospital doctors released another health bulletin on the victim of a brutal attack, Madhavi, this evening. They said that she has been removed from the ventilator and shifted to ICU, as her condition has improved. Her left hand that has been surgically set right, is improving as she is moving her fingers, the doctors said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X