హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిన్నవయసులోనే తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్న 24 ఏళ్ల మహిళకు యశోద ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. 47 ఏళ్ల బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి సేకరించిన గుండెను ఆమెకు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

ఈ సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్‌రావు, గుండె మార్పిడి నిపుణులు డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్, జీవన్‌దాన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలతలు శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన అరుణ (24) ఆమె భర్త గోపాలకృష్ణ, కుమారుడు కార్తిక్‌తో కలసి పుణేలో స్థిరపడ్డారు. ఏడాది క్రితం కుటుంబంతో కలిసి పుట్టింటికి రావడంతో అనుకోని పరిస్థితుల కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. స్థానిక వైద్యులకు చూపించగా మెదడులో రక్తం క్లాట్ అయిందని మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పారు.

అయితే తొమ్మిది నెలల తర్వాత అరుణ మార్తి 20న మళ్లీ అనారోగ్యానికి గురైంది.పుణేలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా పది రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. పలు పరీక్షలు చేసి 'డలేటెట్ కార్డియోమయోపతి' అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

 యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

ఈ ఏడాది ఏప్రిల్ 24న ఆమెను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో సీనియర్ కార్డి యో థొరాసిక్ సర్జన్ డాక్టర్ నరే శ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్‌లు వీలైనంత త్వరగా గుండె మార్పిడి చికిత్స చేయించుకోవాలని సూచించారు. గుండె దానం కోసం వెంటనే 'జీవన్‌దాన్'లో అరుణ పేరుని నమోదు చేశారు.

 యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

ఇంతలో హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురై సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలాజీ (47) బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఆ మేరకు జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథ్ విజ్ఞప్తి మేరకు ఆయన అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు.

 యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

అప్పటికే ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అరుణకు గుండె మార్పిడి చికిత్స చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జూన్ 15న డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్, డాక్టర్ రాజశేఖర్‌ల నేతృత్వంలోని వైద్య బృందం దాత నుంచి గుండెను సేకరించారు. సోమాజిగూడ నుంచి సికింద్రాబాద్‌కు తరలించారు.

 యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

సుమారు 20 మందితో కూడిన వైద్య బృందం 9 గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండెను అమర్చారు. అనంతరం ఆమె కోలుకోవడంతో జూన్ 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్‌లు స్పష్టం చేశారు.

 యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

ప్రసవం తర్వాత ప్రతి వెయ్యి మంది మహిళల్లో ఒకరు పెరిపార్టమ్ కార్డియో మయోపతి బారిన పడే అవకాశం ఉందని అన్నారు. ప్రసవానికి ఒక నెల ముందు ప్రారంభమై, ప్రసవానాంతరం అయిదు నెలల పాటు ఈ సమస్య కొనసాగుతుందని వివరించారు. ఈ సమస్య వల్ల నిస్సత్తువకు గురికావడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.

 యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

యశోద వైద్యుల ఘనత: ఆంధ్రా అమ్మకు తెలంగాణ వ్యక్తి గుండె

అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొంతమందిలో దానంతట అదే నయమవుతుందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ యశోద వైద్యులు తనకు పునర్జన్మ ప్రసాదించారని చెప్పారు. జీవన్‌దాన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ ఇప్పటి వరకు 233 కాలేయ, 400కి పైగా మూత్రపిండాలు, 26 గుండె, 5 ఊపిరితిత్తులు, ఐదు పాంక్రియాస్‌లను సేకరించి ఆయా జబ్బులతో బాధపడుతున్న వారికి పునర్జన్మను ప్రసాదించినట్లు తెలిపారు.

English summary
Yashoda Hospitals performs rare heart transplant on a 24-year old woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X