హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజీపీ మీటింగ్ వేళ : యశ్వంత్ సిన్హా - సీఎం కేసీఆర్ సమావేశం : హీటెక్కుతున్న రాజకీయం..!!

|
Google Oneindia TeluguNews

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. ఇప్పుడు జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ తొలి లక్ష్యం బీజేపీ. తమను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ ను ఈ సారి అధికారం నుంచి దూరం చేయాలనేది బీజేపీ టార్గెట్. ఈ పరిస్థితుల్లో బీజేపీ హైదరాబాద్ కేంద్రంగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు రంగం సిద్దం అవుతోంది. జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ప్రధాని మోదీతో సహా బీజేపీ అధినాయకత్వం మొత్తం తరలి వస్తోంది. కీలక తీర్మానాలు.. రాజకీయ నిర్ణయాలకు ఈ సమావేశాలు వేదిక కానుంది.

హైదరాబాద్ వేదికగా కీలక పరిణామాలు

హైదరాబాద్ వేదికగా కీలక పరిణామాలు

సుదీర్ఘ విరామం తరువాత హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావే శాలు జరగనున్నాయి. దీనికి కొనసాగింపుగా 3వ తేదీ బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. విజయ సంకల్ప యాత్ర పేరుతో నిర్వహించే ఈ సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సభను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లక్షలాది మందిని తరలించే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలోనే జాతీయ విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తున్నారు. జూలై 2వ తేదీన ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం.

అటు బీజేపీ మీటింగ్ - ఇటు సిన్హా ప్రచారం

అటు బీజేపీ మీటింగ్ - ఇటు సిన్హా ప్రచారం


రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఆయన తెలంగాణలో తనకు మద్దతుగా నిలుస్తున్న టీఆర్ఎస్ - కాంగ్రెస్ ఓటర్లతో సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ తోనే భేటీ అవుతారని తెలుస్తోంది. అటు బీజేపీ సమావేశాలు జరగుతున్న సమయంలో వ్యూహాత్మకంగా ఆ కార్యక్రమం ఖరారు చేసినట్లుగా భావిస్తున్నారు. యశ్వంత్ సిన్హా కు కాంగ్రెస్ తో పాటుగా మద్దతు ఇస్తున్నా .. కూటమితో తమకు సంబంధం లేదని ఇప్పటికే మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఎన్డీఏ అభ్యర్ధి ముర్ముకు మద్దతుగా నిలవనున్నారు. టీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు - ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం అయి..మద్దతు కోరునున్నారు.

కేసీఆర్ పార్టీ ప్రకటన వేళ ఆసక్తి కరంగా

కేసీఆర్ పార్టీ ప్రకటన వేళ ఆసక్తి కరంగా


ఇప్పటికే పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించినా..పార్టీ నేతలతో సమావేశం అయి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరేందుకు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే, టీఆర్ఎస్ తో కాకుండా.. కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు - ఎమ్మెల్యేలతో సైతం సిన్హా సమావేశం కానున్నారు. దీంతో.. జూలై 1వతేదీ నుంచి నాల్గవ తేదీ వరకు హైదరాబాద్ కేంద్రంగా కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఇక.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు సిద్దం అవుతున్న సమయంలో..ఈ పరిణామాల తరువాత ఆయన చేయబోయే ప్రకటన పైన మరింత ఆసక్తి పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

English summary
Presidential Candidate Yaswant Sinha reach Hyderabad on 2nd july to meet TRS and Congress leaders for support in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X