• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపిలో యాత్రల సీజన్.!తెలంగాణలో ఏ నాయకున్ని కదిలించినా అదే చర్చ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ బీజేపిలో యాత్రల సీజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. అగ్ర నాయకులందరూ పాదయాత్రలు చేసి ప్రజలతో మమేకం అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎన్నికల కోణం కాకుండా ప్రజా సమస్యలు, ప్రభుత్వం పథకాల అమలు, మౌలిక సౌకర్యాలు, ప్రజావసరాలు తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని పరిష్కారం దిశాగా అడుగులు వేయడమే లక్ష్యంగా పాదయాత్రలు కొనసాగిస్తున్నట్టు బీజేపి అగ్ర నేతలు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో నాయకుడు ఈటల రాజేందర్ ఇప్పటికే యాత్రలు కొనసాగిస్తుండగా తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 24నుండి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సుధీర్ఘంగా పర్యటించబోతున్నారు.

తెలంగాణ బీజేపిలో యాత్రల సీజన్.. అగ్రనేతలంగా ప్రజాక్షేత్రంలోనే..

తెలంగాణ బీజేపిలో యాత్రల సీజన్.. అగ్రనేతలంగా ప్రజాక్షేత్రంలోనే..

బీజేపి తమ శ్రేణులను క్షేత్ర స్థాయిలో ఉత్సాహపరిచేందుకు, పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు అగ్రనాయకులు నడుం బిగించినట్టు తెలుస్తోంది. ప్రజా క్షేత్రంలోకి రావడనికి అంతగా ఇష్టపడని బీజేపి నేతలు బండి సంజయ్ సారథ్య బాద్యతలు తీసుకున్న తర్వాత పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చినట్టు చర్చ జరుగుతోంది. ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాణాళికలు రచించినట్టు తెలుస్తోంది. సమీక్షల పేరుతో పార్టీ కార్యాలయంలో చల్లని గదుల్లో కూర్చుంటే ప్రయోజనం ఉండదని భావించిన సంజయ్ ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు రంగం సిద్దం చేసినట్టు స్పష్టమవుతోంది.

బండి సంజయ్ సుధీర్ఘ యాత్ర.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో మొత్తం తెలంగాణ పర్యటన

బండి సంజయ్ సుధీర్ఘ యాత్ర.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో మొత్తం తెలంగాణ పర్యటన

బండి సంజయ్ బీజేపి బాద్యతలు చేపట్టిన తర్వాత దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను నలభై ఏడు స్థానాలకు తీసుకెళ్లడం కీలక అంశంగా పరిణమించింది. అదే సమయంలో బండి సంజయ్ సారథ్యం పట్ల పార్టీ శ్రేణుల్లో విశ్వాసం రెట్టింపయ్యింది. పార్టీ బలోపేతానికి సంజయ్ అనుసరిస్తున్న విదానాలు, ఎన్నికల్లో గెలుపొందేందుకు అమలు చేస్తున్న వ్యూహాలు ఊహించని ఫలితాలు ఇవ్వడంతో సంజయ్ నాయకత్వం పట్ల పార్టీ శ్రేణుల్లో నమ్మకం బలపడింది. అంతే కాకుండా అధికార పార్టీ విధానాలను విమర్శిస్తున్న తీరుకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీ నేతలు బీజేపిలో చేరిపోయేందుకు వెనకాడడం లేదు.

బండి సంజయ్ నాయకత్వానికి జేజేలు.. క్షేత్రస్ధాయిలో బలోపేతంపై సంజయ్ దృష్ఠి..

బండి సంజయ్ నాయకత్వానికి జేజేలు.. క్షేత్రస్ధాయిలో బలోపేతంపై సంజయ్ దృష్ఠి..

మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఓ క్రేజ్ తీసుకొచ్చిన నాయకుడిగా బండి సంజయ్ కి ముద్ర పడింది. అదే ఉత్సాహాన్ని, ఊపును కొనసాగించేందకు బండి సంజయ్ బృహత్కరప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు లేకున్నా ప్రజలతో మమేకం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఆయన సుమారు రెండు వందల రోజులు పాదయాత్ర చేసేందుకు, ప్రజల మద్యన ఉండేందుకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రణాళికలు రచించారు. ఎన్నికల ఎజెండా కాకుండా ప్రజా సమస్యలు తెలుస్తుకోవడమే ధ్యేయంగా పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

కార్యకర్తల్లో మంచి ఉత్సాహం నెలకొంది.. ఇక ప్రజలతో ఉంటేనే బెటర్ అంటున్న అగ్ర నేతలు..

కార్యకర్తల్లో మంచి ఉత్సాహం నెలకొంది.. ఇక ప్రజలతో ఉంటేనే బెటర్ అంటున్న అగ్ర నేతలు..

ఇక ప్రజా ఆశీర్వాద పాద యాత్ర పేరుతో ఈటల రాజేందర్ ఇప్పటికే హుజురాబాద్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఈటల పాదయాత్ర చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అంతే కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జన ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రజలతో మమేకం అవుతున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర క్యాబినెట్ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఏపి సరిహద్దు నుండి యాత్రను చేపట్టారు. దీంతో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో యాత్రల సీజన్ నడుస్తున్నట్టు చర్చ జరుగుతోంది. పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ అగ్ర నేతలు స్పష్టం చేస్తున్నారు.

English summary
It seems that the yatra season is running in Telangana BJP. All the top leaders are eager to mingle with the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X