హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీరూ మాలాగ తిరగండి.. అప్పుడు అర్థమవుతుంది మా బాధ: మంచు లక్ష్మి అసహనం

నగర రోడ్లపై ట్రాఫిక్ జామ్ గురించి టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ వదిలేసి సామాన్యుల మాదిరిగా తిరిగితేగాని రాజకీయ నేతలకు పరిస్థితి అర్థం కాదంటూ ట్వీట్ చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర రోడ్లపై ట్రాఫిక్ జామ్ ల గురించి టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ వదిలేసి.. సామాన్యుల మాదిరిగా నగర రోడ్లపై వాహనాల్లో తిరిగితేగాని రాజకీయ నేతలకు పరిస్థితి అర్థం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విషయం ఏమిటంటే.. మంచు లక్ష్మీ ప్రసన్న ఇటీవల హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంతంలో గంటన్నర సమయం ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. దీంతో ఆమె నగరంలో ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్ ల గురించి తన ట్విట్టర్ ఖాతాలో ప్రస్తావించారు.

lakshmi-manchu

'గంటన్నర సమయం నేను హైటెక్స్ ఏరియాలో ట్రాఫిక్ లో చిక్కుకున్నాను. ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా మాలాగ సాధారణ పౌరుల మాదిరిగా నగర రోడ్లపై ప్రయాణం చేస్తే ఈ రాజకీయ నాయకులకు తెలుస్తుంది..' అంటూ ట్వీట్ చేశారు.

నిజంగానే ట్రాఫిక్ జామ్ లతో హైదరాబాద్ రోడ్లపై ప్రయాణం రోజురోజుకూ నరకంగా మారుతోంది. ఇందుకు ప్రకృతి సంబంధిత కారణాలు కొన్నయితే మరికొన్ని మానవ తప్పిదాలు కారణం.

సాధారణంగా ప్రజాప్రతినిధులు నగర రోడ్లపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ పోలీసులు వారు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటారు. అది ప్రొటోకాల్. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ కూడా ఆ విషయాన్నే తన ట్వీట్ ద్వారా ప్రస్తావించారు. ఈ విషయంలో చాలామంది నెటిజన్లు ఆమెకు మద్ధతు తెలుపుతూ కామెంట్స్ చేయడం గమనార్హం.

Recommended Video

Heavy Rains Crippled Normal Life In Hyderabad భారీ వర్షానికి వణికిన భాగ్యనగరం | Oneindia Telugu

English summary
Tollywood actress Lakshmi Manchu tweeted the situation of traffic jams on Hyderabad Roads. Recently she has been stuck arount one and half hour on hitex road due to traffic jam. "If politicians should drive like common people without protocol only they will know the traffic jam effect".. she commented in her tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X