వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ గులాములు కావాలా ? గులాబీలు కావాలా : మల్కాజిగిరి సన్నాహక సమావేశంలో కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ పార్టీల అధినేతలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తన దూకుడును కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో తమ జెండా ఎగరేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.

ముసి ముసి నవ్వులు నవ్విండు ఔతల పడ్డాడు .. మోదీపై కేటీఆర్ సెటైర్లు

ఆదర్శ తెలంగాణ

ఆదర్శ తెలంగాణ

టీఆర్ఎస్ సన్నాహక సమావేశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజీగా ఉన్నారు. ఉదయం మెదక్ సీఎస్ఐ గ్రౌండ్ లో జరిగిన సమావేశంలో శ్రేణులు ఉత్సాహపరిచిన కేటీఆర్ .. సాయంత్రం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. రాష్ట్రంలో 17 సీట్లలో విజయం సాధిస్తే .. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు జాతీయహోదా సాధించుకొవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం అమలుచేస్తుందని గుర్తుచేశారు. కేసీఆర్ రైతుబంధును చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు కేటీఆర్.

గులాములు కావాలా ? గులాబీలు కావాలా

గులాములు కావాలా ? గులాబీలు కావాలా

టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బాస్ అని స్పష్టం చేశారు కేటీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఢిల్లీ హైకమాండ్ బాస్ అని చెప్పారు. అధిష్టానానికి చెప్పకుండా వారు బాత్రూం కూడా పోని పరిస్థితి ఉంటుందని విమర్శించారు. మనకు ఢిల్లీ గులాములు కావాలో .. గులాబీలో కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు.

 పోటీ అంటే పారిపోతున్నారు ..

పోటీ అంటే పారిపోతున్నారు ..

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ అంటేనే వణుకుతున్నారని చెప్పారు. మహబూబునగర్ నుంచి పోటీ చేయమని అడిగినా డీకే అరుణ స్పందించడం లేదని .. ఎప్పటిలాగా జైపాల్ రెడ్డిని పోటీ చేయాలని కోరడం ఇందుకు నిదర్శనమన్నారు.

70 అన్నారు ... ఒకటి వచ్చింది

70 అన్నారు ... ఒకటి వచ్చింది

టీఆర్ఎస్ పార్టీకి విపక్షం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలేనని స్పష్టంచేశారు కేటీఆర్. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీగా తీసుకోని మెజార్టీ తీసుకురావాలని కోరారు. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతల మాటలు కోటలు దాటుతాయని .. చేతల గడప దాటవని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లు వస్తాయని పరిపూర్ణనందా స్వామి చెప్పారని గుర్తుచేశారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు గెలిచారని .. 103 చోట్ల ఆ పార్టీ నేతలకు డిపాజట్ గల్లంతైందని గుర్తుచేశారు.

వ్యుహాత్మక ఎత్తుగడ

వ్యుహాత్మక ఎత్తుగడ

పార్లమెంట్ ఎన్నికల్లో వ్యుహాత్మకంగా ముందుకెళ్తున్నారు కేటీఆర్. అందరీని కలుపుకొని పోదామని సూచిస్తున్నారు. మనోళ్లు కాదనే మాట ఉండదని .. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలను కూడా ఓటు అడగాలని కోరారు. అలాగే నేను పెద్ద నాయకుడిని అని భ్రమ విడిచి ఆయా చోట్ల ఓటింగ్ పెరిగేటట్టు చూసుకోవాలని కోరారు. ఇంట గెలిచి రచ్చ గెలువాలని సూచించారు. ఎవరైనా కార్యకర్తలు అలిగితే బుజ్జగించి, సర్దిచెప్పాలే తప్పా .. మిన్నకుండిపోవద్దని సూచించారు.

English summary
In 17 seats in the state, the National Honor will be able to get funds and projects from the center says ktr. Recall that the Center would implement schemes introduced by the Telangana government. Ktr has criticized for congress, bjp parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X