ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆనందంగా హోలీ.. అంతలోనే విషాదం: అదే చివరి రాక..

|
Google Oneindia TeluguNews

కొత్తగూడెం: ఆనందంగా హోలీ పండుగ జరుపుకుని ఇంటి నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరిన ఓ యువకుడు రైలు నుంచి జారిపడి దుర్మరణం చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమ్ముగూడెం వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసు కుంది.

ఎవరీ యువకుడు?:

ఎవరీ యువకుడు?:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గొల్లపల్లి లక్ష్మాతండాకు చెందిన బాణోతు యుగంధర్‌ (25) పాలిటెక్నిక్ డిప్లోమా పూర్తి చేశాడు.

హైదరాబాద్ లో టీటీసీ కూడా పూర్తి చేసి ఇటీవలే టీఆర్టీ పరీక్ష కూడా రాశాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతను.. పండుగ నిమిత్తం ఇటీవల సొంతూరు లక్ష్మాతండాకు వచ్చాడు.

హోలీ తర్వాత హైదరాబాద్‌కు:

హోలీ తర్వాత హైదరాబాద్‌కు:

స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా హోలీ పండుగ జరుపుకున్న యుగేందర్.. ఆదివారం రాత్రి హైదరాబాద్ పయనమయ్యాడు. రాత్రి 10.30గం. సమయంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడినుంచి కాకతీయ ఫాస్ట్‌ పాసింజర్‌ రైలు ఎక్కాడు.

ప్రమాదమా? ఆత్మహత్యా?:

ప్రమాదమా? ఆత్మహత్యా?:

రైల్లో యుగేందర్ డోర్ వద్ద కూర్చొని ప్రమాదవశాత్తూ కిందపడి ఉంటాడని అనుమానిస్తున్నారు. గాంధీపురం రైల్వే స్టేషన్‌ దాటిన తర్వాత కొమ్ముగూడెం గేటు వద్ద రైలు డోర్ వెనుక నుంచి బలంగా నెట్టడంతో కిందపడి ఉంటాడని భావిస్తున్నారు. రైలు కిందపడ్డాక.. సుమారు 100 మీటర్ల వరకు మృతదేహాన్నిఈడ్చుకుపోవడంతో శరీరం నుజ్జునుజ్జయింది.

కుటుంబంలో విషాదం:

కుటుంబంలో విషాదం:


యుగేందర్ మృతికి సంబంధించి స్పష్టమైన కారణాలేవి తెలియకపోవడంతో.. అతను ప్రమాదవశాత్తు మరణించాడా? లేక ఆత్మహత్యనా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.

కాగా, గాంధీపురం రైల్వే స్టేషన్‌ నుంచి కారేపల్లి రైల్వే స్టేషన్‌ వరకు రైల్వే ట్రాక్‌.. మూల మలుపులా ఉంటుంది. దీంతో బోగీలు ఓ పక్కకు వంగి ప్రయాణిస్తాయి.

అలాంటి సందర్భాల్లో ఫుట్ బోర్డు వద్ద కూర్చొంటే ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు. యుగేందర్ మరణంతో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. హోలీకి ఇంటికి రావడమే అతని చివరి రాక అవడం వారిని దు:ఖంలో ముంచింది.

English summary
A 25 years youth fell on the track during footboard travelling in train. He died on the spot, incident took place in Kothagudem district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X