వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ వాహనాన్ని అడ్డుకున్న యువకుడు, అదుపులోకి తీసుకున్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నిరసన ఎదురైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించేందుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా కేసీఆర్ వాహనాన్ని యువకుడు అడ్డుకున్నాడు. యువకుడు ఒక్కసారిగా దూసుకురావడంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరు, ఎందుకు కాన్వాయ్‌పై దూసుకెళ్లాడనే అంశంపై ఆరాతీస్తున్నారు.

తెలంగాణా అవతరణ వేడుకలు : అమరులకు కేసీఆర్ నివాళి ..శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి తెలంగాణా అవతరణ వేడుకలు : అమరులకు కేసీఆర్ నివాళి ..శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

వాస్తవానికి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలపై నిషేధం అమల్లో ఉంది. కానీ యువకుడు ఎలా వచ్చాడో తెలియలేదు. అయితే యువకుడిది నల్గొండ జిల్లా అని పోలీసులు గుర్తించారు. దేవరకొండ మండలం మల్లేపల్లికి చెందిన హనుమంతు అని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇల్లు కోసం వినతిపత్రం ఇచ్చేందుకు గన్ పార్క్ వచ్చానని యువకుడు తెలిపారు. కానీ సీఎం వాహనాన్ని అడ్డుకోవడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

young man block kcr vehicle in gunpark..

కాన్వాయ్‌లోకి హనుమంతు ఒక్కసారిగా వాహనం వద్దకు రావడంతో భద్రత సిబ్బంది టెన్షన్ పడ్డారు. అతడిని అక్కడినుంచి పంపించివేయడంతో.. కాస్త ఊపిరిపీల్చుకున్నారు. డబుల్ బెడ్ రూం కోసం అయితే దరఖాస్తు చేయాలని.. కానీ వాహనాన్ని అడ్డుకోవడం ఏంటీ అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

English summary
a young man block kcr vehicle in hyderabad gunpark. security staff alert and take him custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X