వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ నటి పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచి ఎంటెక్ విద్యార్థి బురిడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీవీలో నటిస్తున్న ఓ నటి పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి దుర్వినియోగం చేస్తున్న ఎంటెక్ విద్యార్థి కిరణ్‌ను సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.25వేల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తన పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, దుర్వినియోగం చేస్తుండటాన్ని సదరు నటి గుర్తించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫోటోలు పెట్టి అతను దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన కిరణ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.

బంధువుల సాయంతో ఎలక్ట్రానిక్ వ్యాపారం చేశాడు. వ్యాపారం సరిగా సాగలేదు. దాదాపు ఏడు లక్షల రూపాయల నష్టం వచ్చింది. వ్యాపారానికి స్వస్తి చెప్పి ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. సులభంగా డబ్బు సంపాదించే ఆలోచన కోసం ప్లాన్ వేశాడు.

Youth arrested for cheating people with TV Actress fake Facebook account

ఆలోచన రాగానే, బుల్లి తెర నటి పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. అనాథ పిల్లల కోసం విరాళాలు పంపించాలని అందులో కోరాడు. కాజీపేట ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చాడు. దీనిని నమ్మి పలువురు విరాళాలు పంపించారు. ఈ డబ్బు డ్రాచేసిన కిరణ్ విలాసాలకు ఉపయోగించాడు.

కిరణ్ నాలుగు నెలల్లో రూ.26 వేల విరాళాలు సేకరించారు. టీవీ నటి ఫోటో ఉండటంతో... అది ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ అని నమ్మి చాలామంది విరాళాలు పంపించారు. పంపించిన వారిలో ఆ నటి స్నేహితులు ఉన్నారు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Youth arrested for cheating people with TV Actress fake Facebook account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X