వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందు కొడితే మటాషే: డిసెంబరు 31న జర భద్రంగా ఉండాలి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Youth Be Careful On December 31st

కొత్త సంవత్సర వేడుకలకు సిద్దమైపోతున్నారా... మందు విందు చిందులతో న్యూఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కం చెబుదామనుకుంటున్నారా... ఒకవేళ హైదరాబాదులో మీరు ఉన్నట్లయితే కొంచెం ఆలోచించాలి మరి. ఎందుకంటే నగర పోలీసులు గట్టి నిఘా పెడుతున్నారు. డిసెంబరు 31న తాగి రోడ్లపై తందనాలు ఆడితే కటకటాల వెనక్కు పంపేందుకు వెనకాడబోమంటున్నారు పోలీసులు. కాబట్టి మందు బాబులు కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తాగి ప్రజలకు ఇబ్బంది కలగజేస్తే మందుబాబులు ఇబ్బందులు కొనితెచ్చుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు డిసెంబర్ 31న అర్థరాత్రి ఒంటిగంట వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉందని ఆపైన నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మకాలు జరిపితే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తోంది పోలీస్ శాఖ.

Youth be careful on December 31st, warns Hyderabad cops

హైదరాబాదులో డిసెంబర్ 31న పోలీసులు గట్టి నిఘా పెడుతున్నారు. ఎవరైనా సరే మందు కొట్టి రోడ్ల మీదకు వచ్చి అల్లరి చిల్లర వేశాలు వేస్తే జూలు విదిల్చేందుకు నగర పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇతర ప్రజలకు ఆటంకం లేదా ఇబ్బంది పడేలా వ్యవహరిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని పోలీస్ శాఖ చెబుతోంది. ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సున్న యువత రోడ్లపై తాగి నానా యాగీ చేస్తే అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపుతామని పోలీసులు చెబుతున్నారు.

ఇప్పటికే పోలీసు శాఖ పలు హుక్కా సెంటర్లపై, గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న దాదాపు 200 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఇక క్లబ్బులు, పబ్బులు, ఫాం హౌజలపై అనుమానం వస్తే దాడులు చేస్తామని కూడా వెల్లడించింది. న్యూఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎక్సైజ్ టీములు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు తనిఖీలు చేస్తాయని పోలీస్ శాఖ వివరించింది. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో గట్టి బందో బస్తు ఏర్పాటు చేయనున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. కాబట్టి ఆరోజు మద్యం సేవించి ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే పోలీసుల దృష్టికి వెంటనే తీసుకురావాలని అలాంటి వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతామని నగరవాసులకు పోలీసులు సూచించారు.

English summary
Hyderabad Police have passed strict orders to the citizens of Hyderabad regarding the new year celebrations. Police have requested the youth not to create any nusance on the eve of New year. If anybody found creating nonsense after taking liquor, he or she would be put behind bars, warned the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X