వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YS Jagan: వైఎస్ షర్మిల రాజకీయ పార్టీపై నోరు మెదపని జగనన్న...ఆసక్తికర చర్చ!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్న సమయంలోనే అందుకు తగ్గట్టుగా షర్మిల అడుగులు కూడా పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తాం అంటూ షర్మిల ప్రకటించేశారు.

ఫ్లెక్సీలలో జగన్ పేరు లేదు, ఫోటో లేదు

ఫ్లెక్సీలలో జగన్ పేరు లేదు, ఫోటో లేదు

ఈ నేపథ్యంలో ఈ రోజు లోటస్ పాండ్ వేదికగా జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో తెలంగాణ రాష్ట్రంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి తో ఆత్మీయ అనుబంధం ఉన్న ప్రముఖులతో షర్మిల భేటీ అయ్యారు. షర్మిల భేటీ తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు వేదికైంది. గతంలో రాజశేఖర్ రెడ్డితో కలిసి కీలకంగా పని చేసిన రాజకీయ ప్రముఖులతో షర్మిల భేటీ అయ్యారు . ఆత్మీయ సమ్మేళనం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడా కూడా జగన్ ఫోటో లేకుండా ఏర్పాటు చేయడం, షర్మిల ఫోటోలు మాత్రమే పెట్టి అభిమానులు సందడి చేయడం ప్రధానంగా కనిపించింది.

షర్మిల పార్టీ గురించి నోరు మెదపని జగన్ మోహన్ రెడ్డి .. ఆ మీడియాలో కనిపించని వార్తలు

షర్మిల పార్టీ గురించి నోరు మెదపని జగన్ మోహన్ రెడ్డి .. ఆ మీడియాలో కనిపించని వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ పెట్టడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు షర్మిల పార్టీ గురించి నోరు మెదపలేదు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పత్రికగా చెప్పుకునే పత్రికలో కూడా కనీసం ఒక వార్తను కూడా షర్మిల గురించి ప్రచురించలేదు. షర్మిల ఆత్మీయ సమావేశం గురించి మీడియా అంతా ఏకరువు పెడుతున్నా, జగన్ కు సంబంధించిన మీడియాలో మాత్రం షర్మిల వార్తలు కనిపించలేదు. ఇప్పుడు ఇది కూడా ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.

జగన్ మౌనం వెనుక కారణమేంటి అన్న ప్రశ్న హాట్ టాపిక్

జగన్ మౌనం వెనుక కారణమేంటి అన్న ప్రశ్న హాట్ టాపిక్

కనీసం షర్మిల వార్తలు ప్రచురించకపోవటం , అసలేం జరగడం లేదు అన్నట్టుగా ప్రవర్తించడం వెనుక జగన్ ఆంతర్యం అంతుచిక్కడం లేదు. వారిద్దరి మధ్య ఏదో జరిగింది అన్న ఆసక్తికర చర్చ ప్రధానంగా జరుగుతోంది. షర్మిల ప్రయత్నాలకు జగన్ మద్దతు లేదు అన్న చర్చ కూడా జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక తెలంగాణా వేదికగా వైఎస్ జగన్ సోదరి షర్మిల వైఎస్ తో కలిసి పని చేసిన ఆత్మీయులతో సమావేశం జరిపినా జగన్ మాత్రం ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు . జగన్ మౌనం వెనుక కారణమేంటి అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పార్టీ రిజిస్ట్రేషన్ పనులు మొదలుపెట్టిన షర్మిల

పార్టీ రిజిస్ట్రేషన్ పనులు మొదలుపెట్టిన షర్మిల

ఈరోజు 150 మంది ముఖ్యనేతలతో షర్మిల సమావేశం నిర్వహిస్తున్నా, ఆమె పార్టీ ఏర్పాటు విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నా జగన్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. షర్మిల ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైయస్ రాజన్న రాజ్యం అనే రెండు పేర్లతో రిజిస్ట్రేషన్ చేయడానికి పార్టీ ఏర్పాటు ప్రక్రియ సైతం ప్రారంభించినట్లు గా సమాచారం. అంతేకాదు వైయస్ షర్మిల హైదరాబాద్ లోటస్ పాండ్ ఖాళీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది .

అన్నాచెల్లెళ్ళ మధ్య విబేధమా ? వ్యూహాత్మకమా

అన్నాచెల్లెళ్ళ మధ్య విబేధమా ? వ్యూహాత్మకమా

గచ్చిబౌలిలో షర్మిల కొత్త ఇంటిని తీసుకున్నట్లుగా కూడా సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ మాత్రం షర్మిల పార్టీ పై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య విభేదాలతో షర్మిల పార్టీ పెడుతున్నారా? లేక తెలంగాణ రాష్ట్రంలో జగన్ సహకారంతో స్ట్రాటజీ తో పార్టీ పెడుతున్నారా ? అన్నది తెలియాలంటే, అసలు అన్నాచెల్లెళ్ల మధ్య ఏం జరిగిందో బయటకు రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

English summary
Despite taking strategic steps to put Sharmila's party in the state of Telangana, AP CM YS Jagan keep silent and has so far not uttered a word about Sharmila's party. Moreover, the media which claims to be related to Jagan did not even publish news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X