వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మీయ ఆహ్వానం... ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించనున్న జగన్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజారీటిని సాధించిన వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఈనెల 30న ప్రమాణస్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా కలిసి విజయవాడలో జరిగే ప్రమాణ స్వికారోత్సవానికి ఆహ్వానించనున్నారు.

YS Jaganmohan reddy will meet telangana cm kcr at hyderarbad

కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే..ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఓడిపోతున్నారని ముందుగానే చెప్పి జగన్‌కు తమ మద్దతును ప్రకటించారు.మరోవైపు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబునాయుడును ఎదుర్కోనేందుకు ఆయనకు రిటర్న్ గిఫ్టు ఇస్తానని బహిరంగాననే ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్.ఇక జగన్ గెలుపును స్వాగతిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో అభినందనలు తెలిపారు. ఈనేపథ్యంలోనే జగన్ ప్రధాని నరేంద్రమోడీని కూడ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు కూడ వెళ్లనున్నట్టు సమాచారం.

రెండు తెలుగు రాష్ట్ర్రాలు విడిపోయిన తర్వాత కొద్ది అటు చంద్రబాబు ,ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య రాజకీయ కక్షలు చెలరేగాయి.ఇక ఇద్దరు ఎప్పుడు కలిసిన అది వార్తగానే మిగిలేది. ఇద్దరు నేతలు అధికారిక కార్యక్రమాల్లో తప్ప ఎప్పుడు ఆత్మీయపలకరింపులు చేసుకున్న పరిస్థితి మాత్రం లేకుండా పోయింది. అయితే జగన్‌తో ఇలాంటీ మనస్పర్థలు మాత్రం ప్రస్థుతానికి లేవు. దీంతో రెండు రాష్ట్ట్రాల మధ్య రాజకీయంగా వ్యక్తిగతంగా కూడ మంచి సంబంధాలు నెలకొనే అవకాశలు ఉన్నాయి.

English summary
YSRCP chief YS Jaganmohan reddy will meet telangana cm kcr at hyderaabd to invite for his swearing-in ceremony on 30th of this month in vajayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X