వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైలెంట్ గా సునామీ తెచ్చిన షర్మిల: తెలంగాణాలో నష్టం ఎవరికి? కేసీఆర్ ఊహించలేదా?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయాలలో మేము సైతం అంటూ ముందుకు వచ్చారు వైయస్ షర్మిల. అయితే తొలినాళ్లలో ఎవరూ వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ తెలంగాణ రాజకీయాలలో వైయస్ షర్మిల క్రమంగా అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రతో మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిల ఊహించని విధంగా తెలంగాణ రాజకీయాలలో సునామీ సృష్టించారు.

పాదయాత్రతో దూకుడు పెంచిన వైఎస్ షర్మిల

పాదయాత్రతో దూకుడు పెంచిన వైఎస్ షర్మిల


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన షర్మిల, ఆ తర్వాత ఊహించని విధంగా తెలంగాణ రాజకీయాల పై ఫోకస్ చేశారు. అయితే ఆమె తెలంగాణా రాజకీయ ఆరంగేట్రాన్ని అంతా ఈజీగా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర రాజకీయ భవిష్యత్తును రూపొందించుకోవడానికి రంగంలోకి దిగిన షర్మిల అక్టోబర్ 2021లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయంతో నిదానంగా తన స్పీడ్ ను పెంచారు.

కాంగ్రెస్ పై షర్మిల పార్టీ ప్రభావం.. అందుకే కేసీఆర్ సైలెంట్

కాంగ్రెస్ పై షర్మిల పార్టీ ప్రభావం.. అందుకే కేసీఆర్ సైలెంట్


మాటల అస్త్రాలను ఎక్కుపెట్టారు. టిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ కుటుంబ పాలన టార్గెట్ చేశారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల చరిత్ర ఏకరువు పెట్టారు. ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై వ్యతిరేకత వ్యక్తం చేసినా, అది కొంతమేరకే పరిమితమైంది. వైయస్ షర్మిల ఫోకస్ అంతా టిఆర్ఎస్ పార్టీ పైనే ప్రధానంగా కేంద్రీకృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలలోకి వచ్చిన తొలినాళ్లలో వైయస్ షర్మిల రాజకీయాల్లోకి రావడం రెడ్డి సామాజిక వర్గం ఓట్లను చీల్చడానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై ప్రభావాన్ని చూపించటానికి అని అందరూ భావించారు. ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తనని షర్మిల పార్టీ పరోక్షంగా బలోపేతం చేస్తుందని అనుకున్నారు.
ఇక ఇదే విషయం కెసిఆర్ కూడా షర్మిల పార్టీ విషయంలో మౌనంగా ఉండేలా చేసిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

షర్మిల మెయిన్ ఫోకస్ కేసీఆర్ , టీఆర్ఎస్ పార్టీ

షర్మిల మెయిన్ ఫోకస్ కేసీఆర్ , టీఆర్ఎస్ పార్టీ

అయితే వైయస్ షర్మిల తెలంగాణలో అందుకు భిన్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి వైయస్ షర్మిల తో ఊహించని తలనొప్పి ఎదురైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల తన టార్గెట్ టిఆర్ఎస్ పార్టీనే అని తన స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో వచ్చే సంవత్సరం ఎన్నికలకు టిఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లాల్సిన క్రమంలో వైయస్ షర్మిల పాదయాత్ర తమ పార్టీపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అని టిఆర్ఎస్ పార్టీ నాయకులు నమ్ముతున్నారు.

షర్మిల పార్టీతో టీఆర్ఎస్ పార్టీకే నష్టం

షర్మిల పార్టీతో టీఆర్ఎస్ పార్టీకే నష్టం

ముఖ్యంగా షర్మిల వైయస్సార్ అభిమానులను, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారిని, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు సన్నిహితంగా ఉండే మతస్తులను ఎక్కువగా ప్రభావితం చేయగలరని భావించిన టిఆర్ఎస్ పార్టీ దానివల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని భావిస్తే ఎక్కువ నష్టం టీఆర్ఎస్ పార్టీకి జరిగేలా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రధాన ఎన్నికలలోనూ పరాజయంపాలై పట్టు కోల్పోతున్న పరిస్థితి ఉంది.

షర్మిల పాదయాత్ర అడ్డుకునే యత్నం అందుకేనా!

షర్మిల పాదయాత్ర అడ్డుకునే యత్నం అందుకేనా!


ఇక బిజెపి టిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళుతూ ఉంది. ఇదే సమయంలో, వైఎస్ షర్మిల కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేయడంతో ఇది కేసిఆర్ కి ఊహించని పరిణామం అన్న చర్చ జరుగుతుంది. తెలంగాణలో వైయస్ షర్మిల ప్రభావంతో టిఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుంది అన్న చర్చ తెలంగాణ సమాజంలో ప్రధానంగా జరుగుతుంది. అందుకే ప్రస్తుతం వచ్చే ఎన్నికల నేపధ్యంలో వైఎస్ షర్మిల పార్టీపైన అధికార టీఆర్ఎస్ కూడా ఫోకస్ చేస్తుంది. ఆమె పాదయాత్రను అడ్డుకునే పనిలో ఉంది అన్న చర్చ జరుగుతుంది.

ఇంట గెలిచి రచ్చ గెలవాలని.. తెలంగాణ ప్రజలను ట్యూన్ చేస్తున్న కేసీఆర్!!ఇంట గెలిచి రచ్చ గెలవాలని.. తెలంగాణ ప్రజలను ట్యూన్ చేస్తున్న కేసీఆర్!!

English summary
If everyone thinks that YS Sharmila's party in Telangana will cause damage to the Congress party, on the contrary, Sharmila is targeting the KCR regime, now it is being discussed that the TRS party will be damaged more than the Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X