హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగాలు నింపడం చేతకాని సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చెయ్ .. షర్మిల ధ్వజం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానని రాజకీయాలు మొదలుపెట్టిన వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న షర్మిల తాజాగా మరోమారు కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రోజుకో నిరుద్యోగి ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్ గారికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉందని వ్యాఖ్యానించారు.

వైఎస్ షర్మిల పార్టీకి షాక్ .. వైఎస్ఆర్టీపీ కీలక నేత చేవెళ్ళ ప్రతాప్ రెడ్డి రాజీనామావైఎస్ షర్మిల పార్టీకి షాక్ .. వైఎస్ఆర్టీపీ కీలక నేత చేవెళ్ళ ప్రతాప్ రెడ్డి రాజీనామా

నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా ఉద్యోగాలను భర్తీ చేయడం లేదంటూ వైయస్ షర్మిల విమర్శించారు. ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, నిరుద్యోగులు చస్తూ ఉన్నా, చచ్చేది నా వాడు కాదు కదా అంటున్న కేసీఆర్ ఈ నిరుద్యోగ చావులకు కారకుడు అంటూ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు వైయస్ షర్మిల. ఇదే సమయంలో నా చావుకి కారణం నిరుద్యోగం అంటూ రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఒక పేపర్ క్లిప్పింగ్ ను ఆమె పోస్ట్ చేశారు.

YS Sharmila demands to Telangana CM KCR to resign as CM over unemployment

నిరుద్యోగుల చావుకు కారణం నిరుద్యోగం, నిరుద్యోగానికి కారణం కేసీఆర్ గారు, నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే, నిరుద్యోగుల చావులకు కారణమవుతున్న కెసిఆర్ గారు ముఖ్య మంత్రి పదవికి అనర్హుడు అంటూ షర్మిల ధ్వజమెత్తారు. ఉద్యోగాలు నింపడం చేతకాని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కోసం పోరుబాట పట్టిన షర్మిల ప్రతివారం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయాలని నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే .

ఇటీవల కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉద్యోగాలను భర్తీ చేసే హృదయాన్ని కేటీఆర్ కు భగవంతుడు ప్రసాదించాలని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇక తాజాగా మరోమారు కెసిఆర్ పై ధ్వజమెత్తిన షర్మిల నిరుద్యోగ సమస్య పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కెసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

English summary
Sharmila, fighting with the Telangana govt on the issue of unemployment, has recently showered criticism on KCR. Unemployment is the cause of death, KCR is the cause of unemployment, all the suicides of the unemployed are government killings and KCR is the cause of the deaths of the unemployed, Sharmila slams kcr as unfit for the post of Chief Minister. The chief minister, who was unable to fill the vacancies, demanded his immediate resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X