హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా కదులుతున్న షర్మిల... హైదరాబాద్,రంగారెడ్డి నేతలతో భేటీ...

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 9న నల్గొండ జిల్లా వైఎస్సార్ అభిమానులతో భేటీ అయిన షర్మిల.. తాజాగా హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లోని వైఎస్సార్ అభిమానులతో సమావేశం కానున్నారు. సోమవారం(ఫిబ్రవరి 15) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వీరితో భేటీ కానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

ఎన్నికల కోడ్‌తో జిల్లాల పర్యటన వాయిదా

ఎన్నికల కోడ్‌తో జిల్లాల పర్యటన వాయిదా

రాష్ట్రంలో నెలకొన్న క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు.. అలాగే తన భవిష్యత్ కార్యాచరణను పంచుకునేందుకు హైదరాబాద్,రంగారెడ్డి వైఎస్సార్ అభిమానులను లోటస్‌పాండ్‌కు రావాల్సిందిగా షర్మిల కబురు పెట్టారు. ఈ సమావేశానికి ఖమ్మం జిల్లా వైఎస్సార్ అభిమానులు కూడా ర్యాలీగా బయలుదేరి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. నిజానికి ఖమ్మం జిల్లాలో తానే స్వయంగా పర్యటించి వైఎస్సార్ అభిమానులను కలుసుకోవాలని షర్మిల భావించారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని అక్కడి నేతలు చెప్తున్నారు.

రెండు,మూడు రోజుల్లో పార్టీ కార్యాలయం...

రెండు,మూడు రోజుల్లో పార్టీ కార్యాలయం...

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి లేదా మాదాపూర్ ప్రాంతాల్లో షర్మిల కొత్త పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నిర్మాణంలో ఉన్న పలు భవనాలను ఇప్పటికే షర్మిల పరిశీలించినట్లు తెలుస్తోంది. రెండు,మూడు రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మాదాపూర్‌లోని వైసీపీకి చెందిన పాత కార్యాలయం నుంచే ఆమె కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే ఇక్కడినుంచి కార్యకలాపాలు సాగిస్తే వైసీపీ,షర్మిల పార్టీ రెండూ ఒక్కటే అనే సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త కార్యాలయం కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ గుర్తు,పేరును కూడా ఖరారు చేస్తామని షర్మిలకు సన్నిహితులైన నేతలు చెప్తున్నారు.

కీలక సూచనలు,మార్గదర్శకాలు...

కీలక సూచనలు,మార్గదర్శకాలు...


కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహకాల్లో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాల వైఎస్సార్ అభిమానులతో సంప్రదింపులకు షర్మిల సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే వరుసగా ఆయా జిల్లాల నేతలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఏర్పాటు,లక్ష్యాలకు సంబంధించిన ప్రణాళికను ఆమె వారికి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. తనతో కలిసి నడిచేందుకు సిద్దంగా ఉన్న అభిమానులు,మద్దతుదారులకు షర్మిల నుంచి కీలక సూచనలు,మార్గదర్శకాలు వెళ్తున్నట్లు సమాచారం. పార్టీ ఖరారు తర్వాత భారీ బహిరంగ సభకు కూడా ఆమె ప్లాన్ చేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

English summary
YS Sharmila rapidly stepping towards forming her own party in Telangana. Sharmila, who met YSR followers of Nalgonda district on the 9th of this month, will be meeting YSR followers of Hyderabad and Rangareddy districts today at Lotus Pond. The meeting is scheduled on Monday (February 15) at 2pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X