వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి నిరాకరణ: కేసీఆర్ అభద్రతాభావానికి నిదర్శనమన్న షర్మిల.. కింకర్తవ్యం!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. వరంగల్ జిల్లాలో ఆగిపోయిన పాదయాత్ర కొనసాగించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న వైయస్ షర్మిలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల తిరిగి పాదయాత్ర కొనసాగించటానికి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి ఏం చేయాలి అన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారు.

వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతి నిరాకరించిన పోలీసులు

వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతి నిరాకరించిన పోలీసులు

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. ఈనెల 4వ తేదీ నుండి నర్సంపేట నియోజకవర్గం లోని లింగగిరి నుండి ఆగిపోయిన చోటి నుండే పాదయాత్ర ప్రారంభించాలని భావించిన వైఎస్ షర్మిల తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. అయితే శాంతి భద్రతలను సాకుగా చూపి పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు. హైకోర్టు కూడా వైయస్ షర్మిల పాదయాత్రను నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వైయస్ షర్మిల పాదయాత్రకు తాము ఎందుకు అనుమతి నిరాకరించకూడదు అంటూ వరంగల్ సీపీ రంగనాథ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చినా సరే పాదయాత్రకి అనుమతి నో

షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చినా సరే పాదయాత్రకి అనుమతి నో

ఇక షోకాజ్ నోటీసులకు సమాధానమిచ్చిన వైయస్సార్ తెలంగాణ పార్టీ లీగల్ సెల్ నాయకులు, కోర్టు పాదయాత్రను నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చిందని, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ షర్మిల ఇప్పటికే చాలా కాలంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారని, మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారని, ఎక్కడా ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని, పోలీసులు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే దీనిపై రెండు రోజుల సమయం కావాలని పేర్కొన్న సి పి రంగనాథ్, మరోసారి పాదయాత్రకు అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ షర్మిల పాదయాత్ర కు అనుమతి ఇవ్వలేదు.

పాదయాత్ర అనుమతి నిరాకరణపై భాగ్గ్గుమన్న షర్మిల

పాదయాత్ర అనుమతి నిరాకరణపై భాగ్గ్గుమన్న షర్మిల


ఇక పాదయాత్ర కు అనుమతి నిరాకరించడంతో వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కెసిఆర్ ఖూనీ చేస్తున్నాడని వైయస్ షర్మిల విమర్శించారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నాడని, ప్రశ్నించే వారికి బేడీలు వేస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఆయన, ప్రశ్నించే గొంతులను అణగదొక్కడం భావ్యమేనా అంటూ ప్రశ్నించారు. మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర శాంతిభద్రతలను పరిరక్షించుకుంటూ చేశామని, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు అని, కోర్టు అనుమతి ఉన్నప్పటికీ పాదయాత్ర కు అనుమతి నిరాకరించడం ముఖ్యమంత్రి అభద్రతా భావానికి నిదర్శనం అన్నారు.

ఇది కోర్టు నిర్ణయాన్ని అగౌరవపరచటం కాదా ?

ఇది కోర్టు నిర్ణయాన్ని అగౌరవపరచటం కాదా ?


మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తరువాత ఇప్పుడు కేసీఆర్ కు ఒక్కసారిగా పాదయాత్ర వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందా అంటూ ప్రశ్నించారు. పాదయాత్ర చెయ్యటానికి కోర్టు అనుమతి ఇచ్చినా పోలీసులు నిరాకరించటం కోర్టు నిర్ణయాన్ని అగౌరవపరచటం కాదా అని ప్రశ్నించారు. తాము శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే తమ మీద దాడి చేసిన వారి వల్ల కలిగిన ఇబ్బందిని తమకు ఆపాదించటం ఎలా కరెక్ట్ చెప్పాలన్నారు.

పాదయాత్రకు అనుమతి నిరాకరణతో వాట్ నెక్స్ట్

పాదయాత్రకు అనుమతి నిరాకరణతో వాట్ నెక్స్ట్


ఇక పాదయాత్రకు అనుమతి నిరాకరణతో ప్రస్తుతం వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై డైలమాలో పడ్డారు. పోలీసుల అనుమతి నిరాకరించిన సమయంలో పాదయాత్రను కొనసాగించడం ఎలా? భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అన్నదానిపై పార్టీ శ్రేణులతో వైయస్ షర్మిల చర్చించనున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ దీనిపై వైఎస్ షర్మిల న్యాయపోరాటం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

English summary
Warangal CP Ranganath denied permission to YS Sharmila's padayatra. YS Sharmila was furious over this. she said this is proof of KCR's insecurity. Future activities will be discussed with the leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X