వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరామర్శ యాత్ర: శ్రీకాంతచారికి షర్మిల నివాళి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నల్గొండ: తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్న కుటుంబాలను ఆదుకుంటామని, కష్టాల్లో అండగా ఉంటామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల భరోసా ఇచ్చారు. ఏ మాత్రం అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. నల్గొండ జిల్లాలో రెండోరోజు బుధవారం ఆమె ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో పర్యటించి ఆరు కుటుంబాలను పరామర్శించారు.

ఆయా కుటుంబసభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ యాత్రలో భాగంగా మోత్కూరు మండలం పొడిచేడుకు వెళ్లిన షర్మిల.. అక్కడ తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి నివాళులు అర్పించారు.

రామన్నపేట మండలం సిరిపురంలో చేనేత సొసైటీని సందర్శించి చేనేత ఉత్పత్తులు, కార్మికుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఉదయం ఆలేరు మండలం శారాజీపేటకు చేరుకున్న షర్మిల.. అక్కడ ఎదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆయన తల్లి పెద్దమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

అక్కడి నుంచి మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో దీతి గౌరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి వెళ్లిన షర్మిల.. వీరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. షర్మిలను చూడగానే వీరయ్య భార్య బాలనర్సమ్మ జ్ఞాపకాలను తలచుకుని బోరున విలపించగా.. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్న కుటుంబాలను ఆదుకుంటామని, కష్టాల్లో అండగా ఉంటామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల భరోసా ఇచ్చారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

ఏ మాత్రం అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. నల్గొండ జిల్లాలో రెండోరోజు బుధవారం ఆమె ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో పర్యటించి ఆరు కుటుంబాలను పరామర్శించారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

ఆయా కుటుంబసభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి పరిస్థితులను తెలుసుకున్నారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

రామన్నపేట మండలం సిరిపురంలో చేనేత సొసైటీని సందర్శించి చేనేత ఉత్పత్తులు, కార్మికుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

షర్మిల

షర్మిల

ఈ యాత్రలో భాగంగా మోత్కూరు మండలం పొడిచేడుకు వెళ్లిన షర్మిల.. అక్కడ తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి నివాళులు అర్పించారు.

షర్మిల

షర్మిల

ఆయా కుటుంబాలను పరామర్శిస్తున్నంత సేపు చాలా మంది ప్రజలు వేచి ఉండి.. షర్మిలను కలసి కరచాలనం చేశారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

బుధవారం ఉదయం ఆలేరు మండలం శారాజీపేటకు చేరుకున్న షర్మిల.. అక్కడ ఎదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆయన తల్లి పెద్దమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

అక్కడి నుంచి మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో దీతి గౌరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

అనంతరం నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి వెళ్లిన షర్మిల.. అక్కడపున్న వీరయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

షర్మిలను చూడగానే వీరయ్య భార్య బాలనర్సమ్మ జ్ఞాపకాలను తలచుకుని బోరున విలపించగా.. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

తర్వాత స్థానికుల కోరిక మేరకు గ్రామంలోని చేనేత సొసైటీ కార్యాలయాన్ని షర్మిల సందర్శించారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

తర్వాత కట్టంగూరుకు చేరుకుని గాదగోని రాములు కుటుంబాన్ని, నకిరేకల్ మండలం మర్రూరు గ్రామంలో పి.సైదులు కుటుంబాన్ని పరామర్శించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

అనంతరం అక్కడి నుంచి నకిరేకల్ మీదుగా కేతేపల్లి మండలం బీమారానికి చేరుకుని నెమ్మాది శేఖర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆ కుటుంబసభ్యుల స్థితిగతులను తెలుసుకున్నారు.

పరామర్శ యాత్ర

పరామర్శ యాత్ర

తర్వాత నకిరేకల్‌కు వెళ్లి అక్కడ రాత్రి బస చేశారు. రెండోరోజు యాత్రలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్ తదితరులున్నారు.

English summary
On Wednesday morning, Sister of the YSR Congress Chief Y.S. Jaganmohan ReddyY.S. Sharmila visited and consoled the family of Eddulla Srinivas in Sharajipeta in Aler district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X