వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YS Sharmila రాజకీయ పార్టీ రూపకర్త ఎవరో తెలిస్తే షాక్ ... ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉందా ? హాట్ టాపిక్

|
Google Oneindia TeluguNews

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటుచేయనున్నట్లుగా వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, వైయస్ షర్మిల ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చకు ఊతం ఇస్తూ ఈరోజు లోటస్ పాండ్ లో వైయస్ ఆత్మీయులతో, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ,త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు .

Recommended Video

#YSsharmila తెలంగాణలో వైఎస్ ష‌ర్మిల కొత్త పార్టీ వెనక ఉన్నది ఎవరు?!

 మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ..టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు, ఉద్రిక్త ఘటనలు, కేసులు మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ..టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు, ఉద్రిక్త ఘటనలు, కేసులు

వైయస్ షర్మిల రాజకీయ పార్టీని పెట్టాలన్న నిర్ణయం వెనుక పెద్ద ప్రణాళిక

వైయస్ షర్మిల రాజకీయ పార్టీని పెట్టాలన్న నిర్ణయం వెనుక పెద్ద ప్రణాళిక


ఇదిలా ఉంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల రాజకీయ పార్టీని పెట్టాలన్న నిర్ణయం వెనుక పెద్ద ప్రణాళికే ఉన్నట్లుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైయస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ పార్టీగా ముద్ర పడిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాగించడం కష్టమని భావిస్తోంది. ఈ సమయంలో పక్కా ప్రణాళికతో వైయస్ షర్మిల తెలంగాణాలో రాజకీయ పార్టీతో పాగా వేయనున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే షర్మిల వేస్తున్న అడుగులు జగన్ సహకారంతో అన్నట్టుగా లేదు .

షర్మిల పార్టీ రూపకర్త అనిల్ కుమార్ , ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్రపై ఆసక్తికర చర్చ

షర్మిల పార్టీ రూపకర్త అనిల్ కుమార్ , ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్రపై ఆసక్తికర చర్చ

ఏపీ లో వైఎస్ జగన్ ను అధికారంలోకి తీసుకురావడంలో క్రియాశీలకంగా పని చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైయస్ షర్మిల వ్యూహకర్తగా పని చేస్తున్నట్లుగా పలువురు ఆసక్తికర చర్చకు తెరతీశారు .

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రస్తుతం రాష్ట్రంలో కొంత విముఖత వ్యక్తమవుతున్న సమయంలో ఇదే అదునుగా తెలంగాణ రాష్ట్రంలో షర్మిలను నిలబెట్టాలనే పట్టుదలతో, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీ తో ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే షర్మిల వెనుక ఉండి నడిపిస్తుంది ఆమె భర్త అనిల్ కుమార్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. అందుకు ఊతం ఇస్తూ ఆయన ఈ రోజు సమావేశ నిర్వహణకు కీలకంగా వ్యవహరించారని టాక్ .

తెలంగాణాలో షర్మిల పార్టీ పెడితే టీఆర్ఎస్ , బీజేపీలకు షాక్

తెలంగాణాలో షర్మిల పార్టీ పెడితే టీఆర్ఎస్ , బీజేపీలకు షాక్

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమాత్రం సత్తా చాట లేకపోయింది. ఇక టిఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. దీంతో బిజెపి పుంజుకోవాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో వైయస్ ఇమేజ్ ను వాడుకుంటూ షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తే అది రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు , బిజెపికి షాక్ అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది సీనియర్ నాయకులు, వైయస్ తో అనుబంధం ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న నాయకులు షర్మిల పార్టీ పెడితే ఆ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు కూడా సమాచారం.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల బిజీలో పీకే .. షర్మిల వెనుక వున్నది ఆమె భర్త అనీల్ కుమార్..

పశ్చిమ బెంగాల్ ఎన్నికల బిజీలో పీకే .. షర్మిల వెనుక వున్నది ఆమె భర్త అనీల్ కుమార్..


ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఊహించని మలుపు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల రూపంలో చోటు చేసుకోబోతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తలమునకలైన నేపథ్యంలో, షర్మిలకు వెనక ఉండి నడిపిస్తున్నారా .. లేదా షర్మిల వెనుక మాత్రం ప్రస్తుతానికి ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పార్టీ పెట్టటం కోసం బాగా ప్రోత్సహిస్తున్నారన్న టాక్ వుంది . ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో షర్మిల వేస్తున్న అడుగుల వెనుక మర్మమేమిటో త్వరలోనే తేలనుంది.

English summary
There is an interesting debate going on as to whether there is a big plan behind the decision of YS Jaganmohan Reddy's sister YS Sharmila to form a political party. There is an interesting debate going on in Telangana as to whether there is a Prashant Kishor strategy behind Sharmila's political party decision. The intiation taken by her with the support of her husband anil kumar . What is the plan? That debate has also started in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X