వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్.. హరీష్‌రావు ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికపై వైఎస్ షర్మిల సెటైర్లు!!

హరీష్‌రావు ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికపై వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అనేక ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల లేమిని ఆమె ప్రశ్నించారు.

|
Google Oneindia TeluguNews

వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని వైద్యారోగ్య శాఖను ముందుకు నడిపించడంలో ఏడాది పూర్తయిన కారణంగా సంవత్సరంలో వైద్యారోగ్య శాఖలో జరిగిన అభివృద్ధిపై ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికను విడుదల చేశారు మంత్రి హరీష్ రావు. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణను నీతి ఆయోగ్ గుర్తించిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రగతిని గురించి హరీష్ రావు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ నివేదికను విడుదల చేశారు. ఇక హరీష్ రావు విడుదల చేసిన ఆరోగ్య శాఖ ప్రగతి నివేదికపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అబద్ధాలు అతికినట్లు చెప్పినా..అవి నిజాలు అయిపోవు మంత్రి గారు: వైఎస్ షర్మిల

అబద్ధాలు అతికినట్లు చెప్పినా..అవి నిజాలు అయిపోవు మంత్రి గారు: వైఎస్ షర్మిల


ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డైడ్"అన్నట్లుంది అరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు విడుదల చేసిన హెల్త్ రిపోర్ట్ అంటూ టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల హరీష్ రావు చెప్పినవన్నీ అబద్ధాలే నంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. అబద్ధాలు అతికినట్లు చెప్పినా..అవి నిజాలు అయిపోవు మంత్రి గారు అంటూ పేర్కొన్న వైయస్ షర్మిల పరికరాలు సమకూర్చాము, భవనాలు కట్టాము అని గొప్పలు చెప్తే సరిపోతుందా? పీహెచ్సీ నుంచి జిల్లా ఆసుపత్రి వరకు వస్తున్న రోగుల సంఖ్య ఎంత..? వారికి వైద్యం అందిస్తున్న సిబ్బంది ఎంత..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

రోగుల ఆర్తనాదాలు వినిపించవు... సర్కారీ దవాఖానలో చావులు కనిపించవు

రోగుల ఆర్తనాదాలు వినిపించవు... సర్కారీ దవాఖానలో చావులు కనిపించవు

అంతేకాదు ప్రభుత్వాసుపత్రులలో వైద్యం అందక రోగుల ఆర్తనాదాలు మీకు వినిపించవు. సర్కారీ దవాఖానలో వైద్యం అందక చచ్చే చావులు కనిపించవు అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మెటర్నిటీ మరణాలను ఆపలేని మీ ప్రభుత్వం.. మెరుగైన వైద్యంలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పడం సిగ్గు అనిపించడం లేదా..? అంటూ వైఎస్ షర్మిల హరీష్ రావులు ప్రశ్నించారు.

౩౦౦మంది సిబ్బంది ఉండాల్సిన ఆస్పత్రుల్లో 30 మంది వైద్యం చెయ్యటం అభివృద్ధా?

౩౦౦మంది సిబ్బంది ఉండాల్సిన ఆస్పత్రుల్లో 30 మంది వైద్యం చెయ్యటం అభివృద్ధా?

ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితి ఎలా ఉందంటే ఆసుపత్రుల్లో నర్సులు ఉంటే డాక్టర్ ఉండడు...డాక్టర్ ఉంటే ఇతర సిబ్బంది ఉండరు. ఎక్స్ రే, సిటీ స్కాన్, టిఫా స్కాన్ లాంటి యంత్రాలకు టెక్నీషియన్ లు లేక ఎన్నో ఆసుపత్రుల్లో మూలకు పడ్డాయి అంటూ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని కళ్లకు కట్టారు .జిల్లా ఆసుపత్రిలో 300 మంది సిబ్బంది ఉండాల్సిన చోట 30 మందితో వైద్యం అందించడం అభివృద్ధి అంటరా..? అంటూ వైఎస్ షర్మిల రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రుల పరిస్థితి పై మంత్రి హరీష్ రావును ప్రశ్నించారు. ఇక ఇప్పటికే అనేకమార్లు ఆరోగ్యశ్రీ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల మళ్లీ హరీష్ రావును ఆరోగ్యశ్రీ విషయంలో నిలదీశారు.

ఆరోగ్య శ్రీని అటకెక్కించారు.. వైఎస్ షర్మిల ఫైర్

ఆరోగ్య శ్రీని అటకెక్కించారు.. వైఎస్ షర్మిల ఫైర్

మహానేతహయాంలో అద్భుతంగా అమలయిన అరోగ్యశ్రీ పథకాన్ని డెత్ బెడ్ ఎక్కించారు అంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు. 800కోట్లు బకాయిలు పెట్టారు. మీరు బిల్లులు ఇయ్యరని కార్పొరేట్ దవాఖానలు కేసులు తీసుకోవడమే మానేశాయి అంటూ వైఎస్ షర్మిల ఆరోగ్యశ్రీని అటకెక్కించిన ప్రభుత్వ తీరును విమర్శించారు .108ను కోమాలో పెట్టారని అసహనం వ్యక్తం చేశారు.104ను మాయం చేశారని మండిపడ్డారు.మొత్తంగా మీరు చెప్పిన అరోగ్య ప్రగతిమసిపూసి మారేడుకాయ చేసినట్లు గానే ఉంది అంటూ వైఎస్ షర్మిల హరీష్ రావు వెల్లడించిన ప్రగతి నివేదికపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

English summary
YS Sharmila satirized Harish Rao's progress report of the health department saying that the operation was a success and the patient died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X