• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైఎస్సార్ పిల్లలకు ఆ రాత లేదేమో-షర్మిల పేరు లేకుండా తెలంగాణలో కొత్త పార్టీ- YSRTPపై ఈసీ కీలక ప్రకటన

|

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే ధ్యేయంగా దివంగత సీఎం వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పొలిటికల్ యాక్టివిటీని ముమ్మరం చేసి, నిరుద్యోగ సమస్యపై కేసీఆర్ సర్కారుతో పోరాటం చేస్తోన్న షర్మిల.. తన పేరు లేకుండానే పార్టీకి నెలకొల్పుతుండటం గమనార్హం. షర్మిల కొత్త పార్టీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం కీలక ప్రకటన చేసింది..

రఘురామ ఇష్యూలో ట్విస్ట్: పార్లమెంట్‌కు ఏపీ సీఐడీ ఉదంతం -షాకైన ఎంపీలు -జగన్‌ను హిట్లర్‌తో పోల్చుతూరఘురామ ఇష్యూలో ట్విస్ట్: పార్లమెంట్‌కు ఏపీ సీఐడీ ఉదంతం -షాకైన ఎంపీలు -జగన్‌ను హిట్లర్‌తో పోల్చుతూ

వైఎస్సార్ తెలంగాణ పార్టీ

వైఎస్సార్ తెలంగాణ పార్టీ

వైఎస్ షర్మిల నెలకొల్పబోయే కొత్త పార్టీకి ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ' అని పేరు పెట్టుకున్నారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం భారత ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టం1951లోని 29ఏ సెక్షన్ ను అనుసరించి కొత్త పార్టీగా గుర్తింపు కోసం వైఎస్సార్ టీపీ దరఖాస్తు చేసుకుందని, ఈ పేరుతో పార్టీ గుర్తింపునకు ఎవరైనా, ఏవైనా అభ్యంతరాలు చెప్పాలనుకుంటే ఈనెల 16లోగా ఢిల్లీ నిర్వచన్ సదన్(ఈసీ ప్రధాన కార్యాలయాన్ని) సంప్రదించాల్సిందిగా ఈసీ గురువారం ఒక పబ్లిక్ నోట్ విడుదల చేసింది. ఈసీ డాక్యుమెంట్ల ప్రకారం మార్చి 23న వైఎస్సార్ టీపీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. కాగా,

షాక్: pm cares నకిలీ వెంటిలేటర్లు -వాటితో మరణాలు సంభవిస్తే కేంద్రానిదే బాధ్యత: బాంబే హైకోర్టుషాక్: pm cares నకిలీ వెంటిలేటర్లు -వాటితో మరణాలు సంభవిస్తే కేంద్రానిదే బాధ్యత: బాంబే హైకోర్టు

షర్మిల పేరు లేకుండా పార్టీ

షర్మిల పేరు లేకుండా పార్టీ

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన ప్రకటనలో ఎక్కడా వైఎస్ షర్మిల పేరు లేకపోవడం గమనార్హం. అనూహ్యంగా వైఎస్సార్ టీపీకి చైర్మన్ గా షర్మిల ప్రధాన అనుచరుడైన వాడుక రాజగోపాల్ ఉంటారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీహెచ్. సుధీర్ కుమార్, ట్రజరర్ గా నూకల సురేశ్ వ్యవహరిస్తారు. దక్షిణాదిలో ఒక మహిళ సారధ్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుకానున్న వైఎస్సార్ టీపీ అనుమతులకు సంబందించిన పత్రాల్లో షర్మిల పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఆ పార్టీ వాళ్లు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇక,

  TOP NEWS : Congo | Etala Rajender | JP Nadda | Delta Variant
  వైఎస్సార్ ఇద్దరు పిల్లలూ అంతే..

  వైఎస్సార్ ఇద్దరు పిల్లలూ అంతే..

  తెలుగు ప్రజల గుండెల్లో మహానేతగా గుర్తిండిపోయిన వైఎస్సార్ కు రాజకీయ వారసులుగా వచ్చిన కొడుకు జగన్ ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకోగా, కూతురు షర్మిల ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయ వారసత్వాన్నైతే అందిపుచ్చుకున్నారుగానీ, సాంకేతికంగా పార్టీల పరంగా ఈ ఇద్దరూ తండ్రి పేరును పొందలేకపోయారు. వైఎస్సార్ అనే అక్షరాలు కలిసొచ్చేలా జగన్.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పెట్టుకోగా, షర్మిలకు వైఎస్సార్ పేరు నేరుగా దక్కినా, పార్టీకి ఆమె అధ్యక్షురాలిగా లేరు. వైఎస్సార్ టీపీలో షర్మిల హోదా ఏమిటనేది పార్టీని స్థాపించబోయే జులై 8నే వెల్లడవుతుందేమో..

  English summary
  The Election Commission of India has announced on thursday that a new political party named ysr telangana party list for registration. interestingly ys sharmila name did not appear in ec documents, her close aide vaduka rajagopal will be chairman of ysrtp. sharmila will launch the new party on ysr jayanthi. ie, july 8th.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X