• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సాక్షికి నేనూ ఓనర్ నే-అమ్మ ఆ హోదాలోనే నాతో : ప్రశాంత్ కిషోర్ మాతోనే-షర్మిల సంచలనం..!!

By Chaitanya
|

కొంత కాలంగా అటు ఏపీలో..ఇటు తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల తన రాజకీయ భవిష్యత్ పైన భారీ అంచనాలతో ఉన్నారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి తన తండ్రి సెంటిమెంట్ ను కొనసాగిస్తూ చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. అయితే, చెప్పుకోదగిన నేతలు..కేడర్ లేకుండా తెలంగాణ లో బలమైన పార్టీలతో షర్మిల ఢీ కొంటున్నారు. ఇదే సమయంలో అన్న జగన్ తో పాటుగా తల్లి విజయమ్మ..అదే విధంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి షర్మిల ఆసక్తి కర అంశాలు వెల్లడించారు.

షర్మిల నుంచి సంచలన విషయాలు

షర్మిల నుంచి సంచలన విషయాలు

ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల తన మనసులోని అంశాలు బయట పెట్టారు. అందులో సాక్షి మీడియా సంస్థలో తన అధికారం గురించి విస్పష్టంగా తేల్చి చెప్పారు. చెల్లెలు తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటును ఏపీ ముఖ్యమంత్రి ..షర్మిల అన్న జగన్ వ్యతిరేకించారు. అయినా..షర్మిల ముందుకే కదిలారు. తెలంగాణ కోడలిగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతానని స్పష్టం చేసారు. ఇక, తెలంగాణలో తన రాజకీయ కార్యక్రమాలకు తమ ఫ్యామిలీకి చెందని సాక్షి మీడియా సరైన కవరేజ్ ఇవ్వటం లేదనే అభిప్రాయం ఈ మధ్య కాలంలో అందరి సమక్షంలోనే షర్మిల వ్యక్తం చేసారు.

సాక్షి కి కో ఓనర్ అని చెప్పటం ద్వారా

సాక్షి కి కో ఓనర్ అని చెప్పటం ద్వారా

పక్కన తల్లి ఉన్న సమయంలోనే సాక్షి మీ ప్రోగ్రామ్స్ కు కవరేజ్ ఇవ్వదు కదా అంటూ వ్యాఖ్యానించగా..తల్లి విజయమ్మ వారించే ప్రయత్నం చేసారు. ఇక, ఇప్పుడు తెలంగాణలో సాక్షి విభాగం షర్మిల టేకోవర్ చేస్తున్నారనే ప్రచారానికి ఈ ఇంటర్వ్యూలో షర్మిల సమాధానం ఇచ్చారు. తాను కూడా సాక్షికి కో ఓనర్ నే అంటూ కామెంట్ చేసారు. అదే విధంగా.. తన తల్లి విజయమ్మ తాము ఏపీకే పరిమితం అని చెబుతున్న వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ షర్మిలకు మద్దతు ఇవ్వటం ...షర్మిలతో పాటుగా సభల్లో పాల్గొనటం పైనా చర్చ సాగుతోంది.

తల్లి విజయమ్మ పాత్ర పైన స్పష్టంగా..

తల్లి విజయమ్మ పాత్ర పైన స్పష్టంగా..

ఈ అంశం పైన షర్మిల క్లారిటీ ఇచ్చారు. విజయమ్మ తన తల్లి అని..వైఎస్సార్ సతీమణిగా తన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ షర్మిల తేల్చి చెప్పారు. వైఎస్సార్ వర్దంతి రోజున షర్మిల వైఎస్సార్ ఆత్మీయులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలనూ చివరగా మాట్లాడిన షర్మిల తెలంగాణలో వైఎస్సార్ పాలన తీసుకువస్తానని స్పష్టం చేసారు. ఇక, కొద్ది రోజుల క్రితం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం తమ పార్టీకి పని చేయటం కోసం రాబోతోందని వెల్లడించారు.

ప్రశాంత్ కిషోర్ భాయ్ ప్రామిస్ చేసారంటూ..

ప్రశాంత్ కిషోర్ భాయ్ ప్రామిస్ చేసారంటూ..

ఎన్నికలకు ముందుగానే పీకే టీం వస్తుందని స్వయంగా సీఎం చెప్పటం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. 2019 ఎన్నికల్లో జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా సేవలందించారు. వచ్చే ఎన్నికలకు అదే తరహాలో వైసీపీకి పని చేస్తారనే విషయం సీఎం జగన్ స్వయంగా చెప్పుకొచ్చారు. ఇక, తెలంగాణలో షర్మిల పార్టీకి ప్రశాంత్ కిషోర్ టీం కు చెందిన ప్రియా పని చేస్తున్నారనే ప్రచారం సాగింది. దీని పైన ఇప్పుడు షర్మిల క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ భయ్..తన పార్టీకి పని చేస్తానని ప్రామిస్ చేసారని చెప్పారు. త్వరలో వస్తారని షర్మిల స్పష్టం చేసారు.

అటు అన్నకు..ఇటు చెల్లకి ఐ ప్యాక్ సేవలు

అటు అన్నకు..ఇటు చెల్లకి ఐ ప్యాక్ సేవలు

దీని ద్వారా అటు ఏపీలో అన్నకు..ఇటు తెలంగాణలో చెల్లి షర్మిలకు ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం సేవలు అందించటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, పాదయాత్రలు చేస్తే సీఎంలు కారని షర్మిల వ్యాఖ్యానించారు. పాదయాత్రల ద్వారా జనం సమస్యలు గుర్తించి..వారికి పరిష్కారం పైన భరోసా కల్పిస్తే అవి ఓట్లుగా వస్తాయని విశ్లేషించారు. తనకు పార్టీలో బలమైన నేతలు లేకున్నా...తమ పార్టీ బలం వైఎస్సార్ అని..తన బలగం వైఎస్సార్ అభిమానులని షర్మిల చెప్పుకొచ్చారు.

అన్నకు రాగి సంకటి..కేసీఆర్ కు బిర్యానీ పెడతా

అన్నకు రాగి సంకటి..కేసీఆర్ కు బిర్యానీ పెడతా

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య సత్సంబంధాలు ఉన్నా..లేకున్నా..గతంలో కౌగిలింతలు ఏమయ్యాయని షర్మిల ప్రశ్నించారు. ఇద్దరూ సమస్యల పరిష్కారానికి సిద్దమైతే తన ఇంట్లోనే వారిద్దరికీ భోజనం ఏర్పాటు చేసి సమావేశం చేయమని అడుగుతానని చెప్పుకొచ్చారు. ఒకరికి ఇష్టమైన సంకటి..మరొకరికి బిర్యానీ తానే చేసి పెడతానంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇలా సాక్షికి తాను కో ఓనర్ అని షర్మిల వ్యాఖ్యానించటం ద్వారా రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే చర్చ మొదలైంది.

షర్మిలకు పీకే సేవల పైన జగన్ కు అభ్యంతరం లేదా

షర్మిలకు పీకే సేవల పైన జగన్ కు అభ్యంతరం లేదా

అదే విధంగా షర్మిల పార్టీకి సైతం ప్రశాంత్ కిషోర్ సేవలు అందించేందుకు ముందుకు వస్తే మరి..జగన్ ఆయన సేవలు కంటిన్యూ చేస్తారా..లేక తన నిర్ణయం మార్చుకుంటారా అనేది మరో కీలక చర్చగా మారుతోంది. గతంలో వైఎస్సార్ జన్మదినం నాడు తన తండ్రికి నివాళి అర్పించేందుకు ఒకటే సమయంలో సీఎం జగన్..షర్మిల ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు రావాల్సి ఉంది.అయితే, ఏపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ..తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్న షర్మిలతో కలవటం ద్వారా అవసరం లేని చర్చలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందనే ఉద్దేశంతో సీఎం జగన్ ఏకంగా తన షెడ్యూల్ నే మార్చుకున్నారు.

  షర్మిళ దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. హౌస్ అరెస్ట్
  రానున్న రోజుల్లో మరింత సంచలనాలకు కేంద్రంగా..

  రానున్న రోజుల్లో మరింత సంచలనాలకు కేంద్రంగా..

  మరి, గతంలో వైసీపీ గెలుపు కోసం..అన్న సీఎం అవ్వటం కోసం నాడు ప్రశాంత్ కిషోర్ తో కలిసి విజయమ్మ..షర్మిల పార్టీ ప్లీనరీలో వేదిక పంచుకున్నారు. ఇక, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ అటు తనకు ..ఇటు షర్మిలకు తన ఐ ప్యాక్ ద్వారా సేవలందిస్తే అందుకు అంగీకరిస్తారా..లేక, ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా అనేది మరో చర్చ. వీటన్నింటికీ అటు జగన్..ఇటు షర్మిల క్యాంపుల్లో చోటు చేసుకొనే పరిణామాలే స్పష్టత ఇవ్వనున్నాయి.

  English summary
  YS Sharmila made sensational comments that she too is a partner in Sakshi Channel and revealed that Prashant kishore will work for YSRTP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X