• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైతులపై ఎందుకంత కక్ష-ఇకనైనా కళ్లు తెరవండి దొరా-కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

|

తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వైఎస్ షర్మిల నిలదీస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక అన్నదాత గోస పడుతుండని వ్యాఖ్యానించారు. తానూ రైతునే అని గొప్పలు పోయే కేసీఆర్‌కు రైతులు బాధలు పట్టవా అని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతుపై ఎందుకంత కక్ష అని నిలదీశారు. ఇకనైనా రైతన్నలు పడుతున్న కష్టాలు చూసి కళ్లు తెరవండి దొరా అని విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా పరిగిలో షర్మిల పర్యటించిన సంగతి తెలిసిందే. దోమ మండలంలోని పాలేపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి ఆవరణలో ఉన్న ధాన్యం కుప్పలు, మొలకెత్తిన వరి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుకున్నారు. క్వింటాలు ధాన్యానికి ఐదు కిలోల చొప్పున దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోయారు. రైతులను ఆదుకోవడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా షర్మిల ఆరోపించారు. కల్లాల్లో ధాన్యం తడిసిపోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మొలకెత్తిన ధాన్యం అధికారులకు కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు.

ys sharmila slams cm kcr over telangana farmers issues

ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించిన సభతో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల యాక్టివ్‌గా మారారు. అప్పటినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దొరల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరట్లేదని... రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెబుతున్నారు. ఇదే క్రమంలో కొలువుల దీక్ష పేరుతో నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నలు,విమర్శలు గుప్పిస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న వైఎస్ షర్మిల సొంత రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)' పేరుతో ఇప్పటికే పార్టీ పేరును రిజిస్టర్ చేయించారు. పార్టీ పేరుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వైఎస్ సతీమణి విజయలక్ష్మి రాసిన లేఖను వైఎస్సార్ టీపీ ఈసీకి సమర్పించింది. పార్టీలో కార్యకర్తలకే పెద్ద పీఠ వేస్తామని... కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులని కొద్ది రోజుల క్రితం ఆమె వ్యాఖ్యానించారు.

English summary
YS Sharmila questioned CM KCR why he is ignoring farmers issues in the state.She said farmers are struggling to sell their grains as government neglecting their issues.She demanded KCR should wake up atleast now and sort out their problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X