• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం సీటును అమ్ముకోవాల్సి వస్తుందని భయమా: కేసీఆర్‌పై షర్మిల ఫైర్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో

|

హన్మకొండ: ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ను సాధించడాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతివారం జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. తన దూకుడును కొనసాగిస్తోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఈ మంగళవారం హైదరాబాద్ నగర శివార్లలోని పీర్జాదిగూడలో పర్యటించనున్నారు. బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిరుద్యోగ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. ఈ నిరహార దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా సమన్వయ కమిటీ నాయకులు పర్యవేక్షిస్తోన్నారు.

క్షణక్షణానికి మారే వాతావరణంతో పోటీ: అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన గంధం చంద్రుడి కుమారుడుక్షణక్షణానికి మారే వాతావరణంతో పోటీ: అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన గంధం చంద్రుడి కుమారుడు

ప్రతి మంగళవారం..

ప్రతి మంగళవారం..

ఇదివరకు- తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ కోసం వైఎస్ షర్మిల చేసిన 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ప్రతి మంగళవారం దీక్ష కొనసాగించేలా నిరుద్యోగ నిరాహర దీక్ష ఆందోళనను చేపట్టారు. ప్రతి మంగళవారం ఎంపిక చేసిన జిల్లాలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తూ వస్తోన్నారు. తొలిసారిగా కిందటి నెల 13వ తేదీన వనపర్తి జిల్లా తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్షను ప్రారంభించారు.

 జిల్లాల్లో విస్తృతంగా..

జిల్లాల్లో విస్తృతంగా..

అనంతరం క‌రీంన‌గ‌ర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట్, మహబూబ్‌నగర్, హన్మకొండ వంటి జిల్లాల్లో ప్రతి మంగళవారం నిరాహార దీక్షను చేపడుతున్నారు. దీన్ని కొనసాగిస్తోంది వైఎస్సార్టీపీ. తెలంగాణలో వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టడం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు ప్రకటించిన 50 వేల ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలనేది వైఎస్ షర్మిల ప్రధాన డిమాండ్.

 బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో

బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో

పీర్జాదిగూడ బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగనున్నారు. 12 గంటల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైఎస్సార్టీపీ నాయకులు పిట్ట రాంరెడ్డి, ఏపూరు సోమన్న, కొండా రాఘవరెడ్డి తదితరులు ఉంటారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పార్టీ కోఆర్డినేటర్లు ఈ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి ఉదయం 8 గంటలకు రోడ్డు మార్గంలో బోడుప్పల్‌కు చేరుకుంటారు.

 10 గంటలకు దీక్ష మొదలు

10 గంటలకు దీక్ష మొదలు

మార్గమధ్యలో- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు నివాళి అర్పిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల కల్లా హయగ్రీవాచారి మైదానానికి చేరుకుని, దీక్ష చేపడతారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కాకపోవడం వల్ల యువత ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయాలపై ప్రసంగిస్తారు. దళిత బంధు అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

 టెట్ నిర్వహించకపోవడం పట్ల

టెట్ నిర్వహించకపోవడం పట్ల

టీచర్ల ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించే కేసీఆర్ ప్రభుత్వం చేస్తోన్న జాప్యం పట్ల వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేక కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటోందని మండిపడ్డారు. ఇక కొత్తగా ఉద్యోగాలు ఇస్తే సీఎం సీటును అమ్ముకోవాల్సి వస్తుందనే ఆందోళన కేసీఆర్ నెలకొన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ కారణంతోనే ఉద్యోగాలను భర్తీ చేయట్లేదా అని నిలదీశారు. ఇప్పుడే ఎలాంటి ఎన్నికలు లేకపోవడం వల్ల..మరో రెండు సంవత్సరాల వరకు ఏ డోకా లేదని, ఎన్నికలప్పుడు నోటీఫికేషన్ ఇవ్వచ్చని కేసీఆర్ అనుకొంటున్నారా? అని ప్రశ్నించారు.

  సింగరేణి బాదిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్న షర్మిళ!!
  నాలుగున్నర లక్షల మంది ఎదురుచూపులు..

  నాలుగున్నర లక్షల మంది ఎదురుచూపులు..

  ఇప్పుడిప్పుడే ఎలాంటి ఎన్నికలు లేకపోవడం వల్లే కేసీఆర్ నాలుగు సంవత్సరాలుగా టీచర్ల ఎలిజిబిలిటీ టెస్టులను నిర్వహించడం లేదా అని వైఎస్ షర్మిల నిలదీశారు. ఇప్పటికే నాలుగురన్న లక్షల మంది టెట్ కోసం ఎదురు చేస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎలాగూ టెట్ పరీక్షలను నిర్వహించబోరనేది స్పష్టమౌతోందని ఆమె అన్నారు. అర్హత ఉన్న నిరుద్యోగులు ప్రైవేట్‌గా అయినా ఉద్యోగాలు చేసుకోవడానికి వెంటనే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనితొ పాటు ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్నీ భర్తీ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ఆమె బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిరుద్యోగ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు.

  English summary
  YS Sharmila, Chief of YSR Telangana Party, to participate one day fasting program named as Nirudyoga Nirahara Deeksha at Boduppal exhibition grounds near Peerzadiguda, Hyderabad on September 21.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X