హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

YS Sharmila Vs Kavitha : పులివెందుల - తెలంగాణ : వార్ ముదురుతోంది..!!

|
Google Oneindia TeluguNews

YS Sharmila Vs MLC Kavitha: వైఎస్ షర్మిల - టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. మంగళవారం హైదరాబాద్ కేంద్రంగా షర్మిల అరెస్ట్..చోటు చేసుకున్న పరిణామాలతో టీఆర్ఎస్ నేతలు వరుసగా షర్మిలను టార్గెట్ చేసారు. కవిత తన ట్వీట్ల ద్వారా షర్మిల పైన విరుచుకుపడ్డారు. తాము వదిలిన బాణం..తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ బీజేపీ మద్దతు షర్మిలకు ఉందనే విధంగా వ్యాఖ్యలు చేసారు. దీని పైన షర్మిల స్పందించారు. దీనికి కౌంటర్ గా మరోసారి రియాక్ట్ అయిన కవిత..పులివెందుల గురించి ప్రస్తావించారు.

షర్మిల లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ఆలస్యం అవ్వటానికి కారణం వైఎస్సార్ అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. షర్మిల గతంలో చేసిన ప్రకటలను ప్రస్తావిస్తూ విప్ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీఆర్ఎస్ మహిళా నేతలు షర్మిల తీరును తప్పు బట్టారు. టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యల పైన ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ కు షర్మిల స్పందించారు. పాదయాత్రలు చేసిందీ లేదు..ప్రజల సమస్యలు చూసిందీ లేదు..ఇచ్చిన హామీల అమలు లేదు..పదవేలే కానీ, పనితనం లేని గులాబీ తోట లో "కవిత"లకు కొదవ లేదంటూ షర్మిల ట్వీట్ చేసారు. దీనికి స్పందనగా కవిత సుదీర్ఘ పోస్టు ట్వీట్ చేసారు.

YS Sharmila vs Kavitha:One side AP CM Jagans sister on the other Telangana CM KCR daughter, tweet war takes interesting turn

అమ్మా..కమల బాణం అంటూ మరోసారి షర్మిలను సంబోధించారు. ఇది మా తెలంగాణం పాలేవో..నీళ్లేవో తెలిసిన చైతన్య గణం అని పేర్కొన్నారు. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు..నేడు తెలంగాణ రూటు..మీరు కమలం కోవర్టు..ఆరేంజ్ ప్యారెట్టు అంటూ కవిత ప్రాసతో షర్మిలను బీజేపీ కోవర్టుగా పేర్కొన్నారు. తాను షర్మిల లాగా పొలిటికల్ టూరిస్ట్ కాదని, రాజ్యం వచ్చాక రాలేదని ట్వీట్ లో వివరించారు. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి "కవిత" అంటూ షర్మిల చేసిన ట్వీట్ కు సమాధానం ఇచ్చారు. కవిత వరుసగా చేస్తున్న ట్వీట్లు..షర్మిల కౌంటర్లు..టీఆర్ఎస్ నేతలు షర్మిల లక్ష్యంగా చేస్తున్న ఆరోపణలతో ఇప్పుడు తెలంగాణలో షర్మిల చుట్టూ రాజకీయం కొనసాగుతోంది. మొత్తంగా షర్మిలను బీజేపీ కోవర్టుగా టీఆర్ఎస్ ముద్ర వేస్తోంది. మరి షర్మిల ఎలా దీనికి సమాధానం చెబుతారో చూడాలి.

English summary
New political developments in Telangana after YSRTP Chief Sharmila Arrest and BJP leaders Support. Now, MLC Kavitha and Sharmila Tweets War begin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X