వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాదయాత్ర టైంలో ఇలానా, అసెంబ్లీ సెషన్స్ బహిష్కరిద్దామా: ముఖ్య నేతలతో జగన్

శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతోంది. సమావేశాలను బహిష్కరించి బాబుకు షాకివ్వాలని వైసిపి యోచిస్తోంది.

దిమ్మతిరిగే షాక్: యాత్రకు ముందు జగన్‌కు కొత్త అస్త్రాన్ని అందించిన రేవంత్దిమ్మతిరిగే షాక్: యాత్రకు ముందు జగన్‌కు కొత్త అస్త్రాన్ని అందించిన రేవంత్

అధికార తెలుగుదేశం పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే తమ పార్టీ అధినేత వైయస్ జగన్ పాదయాత్ర సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని వైసిపి భావిస్తోంది.

 బహిష్కరిద్దామా... నేతలకు జగన్ ప్రశ్నలు

బహిష్కరిద్దామా... నేతలకు జగన్ ప్రశ్నలు

వైసిపి ఎల్పీ సమావేశాన్ని రద్దు చేసిన వైయస్ జగన్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తన పాదయాత్ర సమయంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో వాటిని బహిష్కరిద్దామా అని జగన్ నేతలను ప్రశ్నించారని తెలుస్తోంది.

 పాదయాత్ర సమయంలో కావాలనే సమావేశాలు

పాదయాత్ర సమయంలో కావాలనే సమావేశాలు

మీ పాదయాత్ర సమయంలో కావాలనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని కొందరు నేతలు జగన్‌కు చెప్పారని తెలుస్తోంది. దీంతో మరి సమావేశాలను బహిష్కరిద్దామా లేక ఎవరికైనా అప్పగించుదామా అనే చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. హాజరయ్యే విషయమై నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసినట్లుగా తెలుస్తోంది.

 అసెంబ్లీకి వెళ్లడం ఎందుకు

అసెంబ్లీకి వెళ్లడం ఎందుకు

మైక్ ఇవ్వని, సమస్యలు చర్చించని అసెంబ్లీకి వెళ్లడం ఎందుకని కొందరు నేతలు.. జగన్ వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. దానికి జగన్ కూడా అవును అన్నట్లుగా తెలుస్తోంది.

 వైసిపి ఎల్పీ మీటింగ్‌లో నిర్ణయిద్దాం

వైసిపి ఎల్పీ మీటింగ్‌లో నిర్ణయిద్దాం

పార్టీ మారిన ఇరవై మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేద్దామని, అలా చేస్తే సమావేశాలకు వెళ్దామని కొందరు నేతలు అన్నారు. అలాగే వైసిపి నుంచి వెళ్లి మంత్రులు అయిన అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులను బర్తరఫ్ చేయాల్సిందే అన్నారు. అప్పుడే సమావేశాలకు వెళ్దామన్నారు. కాగా, అసెంబ్లీని బహిష్కరించాలా వద్దా అనే విషయాన్ని వైసిపి ఎల్పీ సమావేశంలో నిర్ణయిద్దామని జగన్ చెప్పారని తెలుస్తోంది.

English summary
It is said that YSR Congress Party may boycott winter assembly sessions. YSR Congress Party chief YS Jaganmohan Reddy is asking party leaders on boycotting next assembly sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X