వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కౌంటర్: బాబుతో సహా మంత్రులపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యురాలు రోజాపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్‌కు సిద్ధపడ్డారు. రోజాపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు అనిత ప్రివిలెజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రోజా సహా కొంత మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను ఈ భేటీకి వైసిపి ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కొడాలి నాని, జ్యోతుల నెహ్రూ, టిడిపి ఎమ్మెల్యే అనితను పిలిచారు. ఈ స్థితిలో సభా హక్కులను ఉల్లంఘించారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్‌లపై వైసిపి ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

 YSR congress srves privilege notice against Chandrababu and Ministers

ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను, ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యులను దూషించారని ఆరోపిస్తూ వారు ఆ నోటీసు ఇచ్చారు. రోజాను శుక్రవారం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సభలోకి రానీయకపోవడంపై వైయస్ జగన్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ వ్యూహాన్ని వివిధ కోణాల్లో కౌంటర్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సభా హక్కుల ఉల్లంఘన కిందనోటీసు ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.

English summary
YSR Congress MLAs gave privilege notice against CM Nara Chandrababu naidu and ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X