• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైఎస్సార్ ద్రోహి, ఆయన వారసులనూ నమ్మొద్దు -ఆంధ్రా తొత్తులకు స్థానం లేదు :షర్మిలపై హరీశ్ రావు ఫైర్

|

భవిష్యత్ రాజకీయం రీత్యా ఆంధ్రా వర్సెస్ తెలంగాణ సెంటిమెంట్‌ను సుస్థిరం చేసేలా అధికార టీఆర్ఎస్ పార్టీ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. కొద్ది రోజులుగా కృష్ణా జలాల వివాదంలో ఏపీని, ఆ రాష్ట్ర సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్సార్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోన్న టీఆర్ఎస్ నేతలు.. తాజాగా వైఎస్ కూతురు, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలనూ తూర్పారపడుతున్నారు. సీనియర్ మంత్రి హరీశ్ రావు మరో అడుగు ముందుకేసి, వైఎస్ తెలంగాణ ద్రోహి అని, అసలు ఆంధ్రా తొత్తులకు తెలంగాణలో స్థానమే లేదని ఆగ్రహించారు. సంగారెడ్డి జిల్లాలోని స‌దాశివ‌పేట‌లో మంత్రి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా..

 ఎన్నికల ముందు బీజేపీ జనాభా బాంబు -యూపీలో ఇద్దరు పిల్లల విధానం -కాదంటే పథకాలు, ఉద్యోగాలు కట్ ఎన్నికల ముందు బీజేపీ జనాభా బాంబు -యూపీలో ఇద్దరు పిల్లల విధానం -కాదంటే పథకాలు, ఉద్యోగాలు కట్

సిగరెట్టా, బీడీనా అన్నాడు

సిగరెట్టా, బీడీనా అన్నాడు


తెలంగాణ రాజన్న రాజ్యం స్థాపన కోసమే వైఎస్సార్ టీపీ పేరుతో కొత్త పార్టీ పెట్టానని, అధికార టీఆర్ఎస్ పీఛమణచడమే ధ్యేయమని వైఎస్ వైఎస్ షర్మిల చేసిన ప్రకటనలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గతంలో రాజ శేఖర్ రెడ్డి తెలంగాణను అడుగడుగునా అవమానించాడని, ఇవ్వడానికి అదేమైనా సిగరెట్టా..? బీడీనా? అని అవహేళన చేశాడని, అలాంటాయన వారసులు ఇవాళ కొత్త పార్టీలతో వస్తున్నారని, తెలంగాణ నీళ్లు, నిధులను ఆంధ్రకు తరలిస్తున్నందుకు మీకు మద్దతు ఇవ్వాలా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్

ఆంధ్రా తొత్తులకు స్థానం లేదు

ఆంధ్రా తొత్తులకు స్థానం లేదు

తాను బతికుండగా ప్రత్యేక రాష్ట్రం రాబోదని కరాకండిగా చెప్పిన వైఎస్సార్.. కుట్రపూరితంగానే రాయల తెలంగాణను తెరపైకి తెచ్చారని, 100 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటేనే తెలంగాణ వస్తుందని అనుచితంగా మాట్లాడాడని, అలాంటి వ్యక్తి ఏనాడూ తెలంగాణ ప్రజల హృదయాల్లో లేరని, ఆయన వారసులకు కూడా స్థానం లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. అసలు ఆంధ్రా తొత్తుల‌కు తెలంగాణ‌లో స్థానమే లేదని మంత్రి అన్నారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు చేయలేనిది కేవలం 7ఏళ్లలో కేసీఆర్ చేసి చూపించారని, ఆ అభివృద్ధిని చూసి ఇవాళ మిగతా పార్టీల వాళ్లూ టీఆర్ఎస్ లో చేరుతున్నారని హరీశ్ తెలిపారు.

కాంగ్రెస్ కలలు, సంగారెడ్డికి నీళ్లు

కాంగ్రెస్ కలలు, సంగారెడ్డికి నీళ్లు


తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్‌లో ఎక్కువ, ప్రజల్లో తక్కువ ఉంటారని, తర్వాతి ఎన్నికల్లో అధికారంలో వస్తామని వారు పగటి కలలు కంటున్నారని, కనీస ప్రతిపక్ష హోదా కూడా వారికి లేదని హరీశ్ ఎద్దేశా చేశారు. సంగారెడ్డి స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి దేనికీ ఫోన్ ఎత్తడని, కనీసం స్పందించబోడిని మంత్రి అన్నారు. గ‌త పాల‌కులు సంగారెడ్డికి చేసిందేమీ లేదని కేసీఆర్ మాత్రం స‌దాశివ‌పేట‌కు కూడా త్వ‌ర‌లోనే గోదావ‌రి నీళ్లు తీసుకోస్తారని మంత్రి హామీ ఇచ్చారు. నిమ్జ్ ప్రారంభ‌మైతే ఈ ప్రాంత యువ‌త‌కు వేలాది సంఖ్య‌లో ఉద్యోగాలు వ‌స్తాయ‌ని, దేశంలో ప్ర‌తి గ్రామంలో ట్రాక్ట‌ర్, ట్యాంక‌ర్ ఉన్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్ర‌మే అని హరీశ్ రావు చెప్పారు.

English summary
trs seniour and telangana minister Harish Rao slams late ysr and ysr successors. speaking sadasivpet of sangareddy, minister slams YS Sharmila, who recently announced a new party under the name of YSR Telangana Party. harish told that late ys Raja Shekhar Reddy was anti telangana and criticised the movement many time. minister said, andhra parties will not have space in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X