వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్‌ఎస్‌కు వైసీపీ మద్దతు: అక్కడ సమీకరణాల వెనుక: మరి..పవన్ ఎవరి వైపు..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌కు మరో పార్టీ మద్దతు. తెలంగాణలో పట్టు లేకపోయినా.. అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలతో తెలంగాణ అధికార పార్టీ..ఏపీ అధికార పార్టీ మద్దతు కోరింది. దీనికి వారు సైతం సై అన్నారు. దీంతో..ఇప్పటి వరకు ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రులు..ప్రభుత్వాల మధ్య ఉన్న స్నేహ బంధం ఇప్పుడు రాజకీయ పొత్తుగా మారుతోంది. కొత్త సమీకరణాలకు తెర లేపుతోంది.

వైసీపీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించటంతో..ఇక.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జనసేన మద్దతు కోరుతోంది. హుజూర్ నగర్ లో టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే సీపీఐ..ఇప్పుడు వైసీపీ మద్దతు లభించింది. బీజేపీ..టీడీపీ సైతం బరిలో ఉన్నాయి. ఇప్పుడు టీఆర్‌ఎస్‌.. వైసీపీ మద్దతు ఎందుకు కోరింది. వైసీపీ మద్దతిస్తే అక్కడ జరిగేందేంటి..

హుజూర్ నగర్ లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా వైసీపీ..

హుజూర్ నగర్ లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా వైసీపీ..

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డిని కలసి మద్దతు కోరగా ఆయన సానుకూలంగా స్పందించి మద్దతు తెలిపారు. తాజాగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేమ సంబంధాలు..ఇప్పుడు రాజకీయ పొత్తులు మారుతున్నాయి. తెలంగాణలో భవిష్యత్ రాజకీయానుల పరిగణలోకి తీసుకొని వైసీపీ ఇప్పుడు మద్దతిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే..దీని కారణంగా ఏపీలో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సీపీఐ సైతం మద్దతు ప్రకటించింది.

వైసీపీ మద్దతు ఎందుకంటే..అక్కడ బలం ఇలా

వైసీపీ మద్దతు ఎందుకంటే..అక్కడ బలం ఇలా

హుజూర్ నగర్ లో ఇప్పుడు సడన్ గా టీఆర్‌ఎస్‌కు వైసీపీ అవసరం ఎందుకు వచ్చింది అనేది చర్చనీయాంశంగా మారింది. హుజూర్ నగర్ లో రెడ్డి సామాజిక వర్గం..అందునా కొన్ని ప్రాంతాల్లో ఏపీ నుండి వచ్చి సెటిల్ అయిన వారు అందునా వారిలో రెడ్డి వర్గం వారు ఎక్కువ.

2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ లో వైసీపీ నుండి గట్టు శ్రీకాంతరెడ్డి పోటీ చేసారు. ఇప్పుడు ఆయనే తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆయనకు అక్కడ పోలైన మొత్తం ఓట్లలో టీడీపీ కంటే ఎక్కవ ఓట్లు సాధించారు. 16.6 శాతం గా 29,692 ఓట్లు సాధించారు. ఇప్పుడు టీడీపీ సైతం బరిలో ఉండటంతో వైసీపీ మద్దతు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

మరి..పవన్ మద్దతెవరకి...

మరి..పవన్ మద్దతెవరకి...

ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధికి కోదండరాం పార్టీ మినహా మరెవరూ మద్దతు ఇవ్వటం లేదు. దీంతో..అక్కడ టీడీపీ పోటీలో ఉండటం..వైసీపీ అధికార పార్టీకి మద్దతిస్తుండటంతో.. పవన్ కళ్యాణ్ మద్దతు అందుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించింది.

అయితే, జనసేన మిత్రపక్షాలైన సీపీఐ ఇక్కడ టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తుండగా..సీపీఎం నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో..జనసేన అధినేత పవన్ ఎవరికి మద్దతిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. దీని పైన ఆ పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏ పార్టీకి అయిన పవన్ మద్దతిస్తారా..లేక తటస్థంగా నిలుస్తారా అనేది ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

English summary
YSRCP decided to support TRS candidate in Huzurnager by poll. Already CPi supporting TRS. TDp and Bjp also in by poll contest. Now Congress waiting for pawan kalyan decision on supprt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X