వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేటర్ ఎఫెక్ట్, వైసిపి ఫౌండర్‌కు షోకాజ్: 'పార్టీ'ని ఇచ్చిన శివకుమార్‌కు జగన్ షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ వ్యవస్థాపకులు శివకుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ తెలంగాణ పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శివకుమార్‌కు ఆదివారం షోకాజ్ నోటీసులు పంపించారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో అసంతృప్తికి గురైన శివకుమార్.. పోటీ చేయక పోవడాన్ని పత్రికాముఖంగా నిలదీశారు.

లోకేష్! సిటీ ప్రశాంతంగా ఉండొద్దా: సుమన్, గ్రేటర్ బరి నుంచి జగన్ పార్టీ ఔట్లోకేష్! సిటీ ప్రశాంతంగా ఉండొద్దా: సుమన్, గ్రేటర్ బరి నుంచి జగన్ పార్టీ ఔట్

YSRCP founder president Show cause notice served

దీంతో, పార్టీ తెలంగాణ అధ్యక్షులు పొంగులేటి ఆయనకు షోకాజ్ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు, నిబంధనలు ఉల్లంఘించి మీడియాకు ఎక్కారని అందులో పేర్కొన్నారు. పది రోజుల్లో దీనిపై సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులో వారు సూచించారు.

గ్రేటర్ ఎన్నిక, 2వేల నామినేషన్లు: రంగంలో వారసులు, బరిలో 21 ఏళ్ల కుర్రాడుగ్రేటర్ ఎన్నిక, 2వేల నామినేషన్లు: రంగంలో వారసులు, బరిలో 21 ఏళ్ల కుర్రాడు

కాగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుకున్నట్లు అయిదు రోజుల క్రితం ప్రకటించింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయమని, అయితే పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని వైసిపి చెప్పింది. గ్రేటర్ బరి నుంచి వైసిపి తప్పుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

అయితే, గ్రేటర్ బరి నుంచి వైసిపి తప్పుకోవడాన్ని పార్టీ వ్యవస్థాపకులు, ప్రధాన కార్యదర్శి శివకుమార్ ప్రశ్నించారు. ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. పార్టీ పోటీ చేయక పోవడం తనను బాధించిందని ఆయన చెప్పారు. దీంతో అతనికి నోటీసులు జారీ చేశారు.

English summary
YSR Congress Party on Sunday served a show-cause notice on its general secretary K. Siva Kumar, charging him with violating party’s discipline by airing his views against the party’s decision not to contest in the GHMC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X