వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వవన్‌కు ఇవాళ గుర్తుకొచ్చిందా, ఆ విమర్శలు అర్ధరహితం: వైసీపీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడంలో అర్ధరహితమని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంతోనే తాము అసెంబ్లీకి వెళ్ళడం లేదని వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు. అసెంబ్లీకి వైఎస్ జగన్ హజరుకాకపోవడంపై విమర్శలు చేశారు.

Ysrcp leader Vasireddy Padma slams on Pawan Kalyan

పవన్ కళ్యాణ్ విమర్శలపై వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం నాడు కౌంటరిచ్చారు రాష్ట్ర ప్రజల సమస్యలను మూడేళ్ళ పాటు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని వైసీపీ నిలదీసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలని ఆమె చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజల పక్షాలన తమ పార్టీ ఎమ్మెల్యేలు పోరాటం చేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్టున్నారన్నారు.

ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంతోనే తమ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్టు వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు.నాలుగేళ్ళుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారని అందుకే బాబు దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని విమర్శించామని ఆమె ప్రస్తావించారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ వాస్తవాలను మాట్లాడారని ఆమె గుర్తు చేశారు. ప్రధానమంత్రి మోడీని విజయసాయిరెడ్డి కలిస్తే తప్పేముందన్నారు కేసులున్నవారు మోడీని కలిస్తే కేసులను మాఫీ చేసుకొనేందుకేనా అని ప్రశ్నించారు. ఈ విమర్శలు ప్రధానమంత్రిని అవమానించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
మరో వైపు బిజెపికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి ప్రధానమంత్రిని, మంత్రులను రోజుకు ఎన్ని సార్లు కలుస్తుందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

English summary
Ysrcp official spokesperson Vasireddy Padma made allegations on Pawan kalyan on Thursday. She condemned pawan kalyan allegations on ys Jagan. She spoke to media At Amaravathi on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X