• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తలాపున సముద్రం, చేప దాహం -ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ల దందా -సీఎం కేసీఆర్‌‌పై వైఎస్ షర్మిల ఫైర్

|

తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ వ్యాక్సిన్ల దందా నడుస్తోందని, ప్రభుత్వ టీకా కేంద్రాల్లో కొరత ఏర్పడగా, ప్రైవేటులో మాత్రం వ్యాక్సినేషన్ జోరుగా సాగుతుండం వెనుక మతలబు ఏందో చెప్పాలంటూ వైఎస్సార్ టీపీ నేత వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. వ్యాక్సిన్ల దందాపై వెలుగు దినపత్రిక క్లిప్పింగ్స్ తో షర్మిల ఆదివారం సంచలన ట్వీట్లు చేశారు..

ఆనందయ్య మందు: TDPకి షాక్ -సోమిరెడ్డిపై చీటింగ్ కేసు -వైసీపీ నకిలీ వ్యాపారమన్న అచ్చెన్నాయుడుఆనందయ్య మందు: TDPకి షాక్ -సోమిరెడ్డిపై చీటింగ్ కేసు -వైసీపీ నకిలీ వ్యాపారమన్న అచ్చెన్నాయుడు

HIV మహిళకు Covid: 216 రోజుల్లో వైరస్ 32 సార్లు మ్యూటేషన్ - భారత్‌లో బీభత్సమే: షాకింగ్ రీసెర్చ్

ప్రైవేటులో టీకాల దందా..

ప్రైవేటులో టీకాల దందా..


తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ధరకు టీకాల అమ్మకాలు సాగుతున్నాయని, ఒక్కో డోసుకు రూ.1600 వసూలు చేస్తున్నారని, మొత్తం 5 రోజుల వ్యవధిలోనే రూ.21 కోట్ల బిజినెస్ జరిగిందని, అదే ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లకు మాత్రం టీకాల పంపిణీ సరిపడా సాగడంలేదంటూ వెలుగు పత్రిక ఆదివారం నాటి సంచికలో ఓ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన సదరు పత్రిక కథనాన్ని వైఎస్ షర్మిల షేర్ చేశారు.

 కేసీఆర్‌పై షర్మిల ఫైర్

కేసీఆర్‌పై షర్మిల ఫైర్

‘‘తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడ‌నే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్న‌య్‌. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి. ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..?'' అని షర్మిల ఘాటుగా ప్రశ్నించారు.

తెలంగాణలో టీకాల కొరత

తెలంగాణలో టీకాల కొరత

వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్రం అసంబద్ధ విధానాలు రూపొందించడంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. టీకాల సేకరణ కోసం తెలంగాణ సర్కారు గ్లోబల్ టెండర్లు పిలవగా, ఒక్క సంస్థ కూడా బిడ్ దాఖలు చేయలేదు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను 45 ఏళ్లు పైబడినవారికి, సూపర్ స్ప్రెడర్ కేటగిరీకి, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అందజేస్తున్నారు. షర్మిల విమర్శలపై టీఆర్ఎస్ సర్కారు స్పందించాల్సిఉంది.

English summary
ysr telangana party leader ys sharmila once again raised her voice against telangana govt and chief minister kcr. sharmila alleged that telangana is facing covid vaccine shortage and vaccine black market is rising in the state. sharmila slams cm kcr over poor vaccination measures
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X