• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ పార్టీ మాజీ చీఫ్ బీజేపీలో చేరిక -షర్మిలకు షాకిచ్చిన గట్టు శ్రీకాంత్ రెడ్డి-కేసీఆర్ శీర్షాసనమంటూ బండి ఫైర్

|

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారధ్యంలోని వైసీపీ పార్టీకి తెలంగాణ అధ్యక్షుడిగా వ్యవహరించిన గట్టు శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్ పేరుతో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల వెంటే ఇక్కడి వైసీపీ నేతలు నడుస్తారన్న అంచనాలను తలకిందులు చేస్తూ ఆ కుటుంబానికి ఎంతో దగ్గరివాడైన శ్రీకాంత్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి గురువారం బీజేపీలో చేరారు.

జగన్ ఉన్నత శిఖరాలకు..

జగన్ ఉన్నత శిఖరాలకు..

రాష్ట్ర విభజన తర్వాతి నుంచి జగన్ పూర్తిగా ఏపీకే పరిమితం అయినా, 2019 ఎన్నికల వరకూ చాలా మంది నేతలు వైసీపీనే అంటిపెట్టుకుని ఉండటం, వైఎస్ షర్మిల ఎంట్రీ తర్వాత.. తెలంగాణలో వైసీపీ విస్తరణపై జగన్ కు ఆసక్తిలేదని సజ్జల రామకృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టడంతో పార్టీ నేతలంతా తలోదారి చూసుకుంటున్నారు. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంలో(ఏప్రిల్ లో) గట్టు శ్రీకాంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బరువెక్కిన గుండెతో వైసీపీని వీడుతున్నానని, ఏపీ సీఎం జగన్ ఇంకా గొప్ప స్థానాలకు వెళ్లాలని ఆశిస్తున్నానని, ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన గొప్ప వ్యక్తి జగన్ అని గట్టు భావోద్వేగానికి గురయ్యారు.

ఇక్కడ రేవంత్, అక్కడ నవజ్యోత్ సిద్దూ -పంజాబ్ పీసీసీ చీఫ్‌గా ఫైర్ బ్రాండ్? -సీఎంతో లొల్లి, ప్రియాంక ఫార్ములా!ఇక్కడ రేవంత్, అక్కడ నవజ్యోత్ సిద్దూ -పంజాబ్ పీసీసీ చీఫ్‌గా ఫైర్ బ్రాండ్? -సీఎంతో లొల్లి, ప్రియాంక ఫార్ములా!

హుజూర్‌నగర్ నుంచి బరిలోకి..

హుజూర్‌నగర్ నుంచి బరిలోకి..

వైఎస్ కుటుంబంతో అనుబంధం రీత్యా శ్రీకాంత్ రెడ్డి షర్మిల పార్టీలో చేరతారని భావించినా చివరికి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి 2023 ఎన్నికల్లో హుజుర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని స్పష్టం చేశారు. అనుచరులతో కలిసి బీజేపీ కండువా కప్పుకున్న శ్రీకాంత్ రెడ్డికి బండి సంజయ్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. జగన్ పేరును నామమాత్రంగానైనా ప్రస్తావించకుండా, టీఆర్ఎస్, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మూర్ఖత్వ పాలనను అంతం చేసేందుకు చాలామంది బీజేపీలో చేరుతున్నారని సంజయ్ అన్నారు. ఇంకా..

జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్

కేసీఆర్ శీర్షాసనం వేసినా గెలవలేడు..

కేసీఆర్ శీర్షాసనం వేసినా గెలవలేడు..


‘‘బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఆయన రాజకీయ భవిష్యత్‌కు తెలంగాణ ప్రజలే సమాధి కడతరు. నిజాం పాలనలో కంటే ఎక్కువ అరాచకాలు టీఆర్ఎస్ పాలనలో జరిగినయ్. ఎన్నికలు వచ్చినప్పుడు మాటలు చెప్పే కేసీఆర్.. ఆ తర్వాత ఫామ్‌హౌస్‌లో పండుతడు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుస్తున్నడని తెలిసే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తుండు. హుజూరాబాద్‌లో తలకాయ కిందికి.. కాళ్ళు పైకి పెట్టి శీర్షాసనం వేసినా నా కేసీఆర్ గెలవడు. టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్ధి కూడా దొరుకడంలేదు. టీఆర్ఎస్‌కు అక్కడ డిపాజిట్ కూడా రాదు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని త్వరలోనే ఉద్యమం చేస్తాం'' అని బండి సంజయ్ అన్నారు.

English summary
ys jagan led ysrcp telangana former chief gattu srikanth reddy joins bjp on thursday. srikanth reddy was welcomed by telangana bjp chief bandi sanjay at state party office in hyderabad. srikant reddy will contest as bjp candidate in huzurnagar seat in next elections. bandi sanjay slams cm kcr and trs govt over several issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X