• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మమ్మల్ని అవమానించారు..నా చెయ్యి విరగ్గొట్టారు..అయినా: నాటి ఘటనలపై వైఎస్ షర్మిల

|

వనపర్తి: తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. పోరు బాట పట్టింది. ఉద్యోగాల నోటిఫికేషన్‌ను సాధించడమే లక్ష్యంగా నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు తెర తీసింది. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలకు దిగింది. ఇందులో భాగంగా- ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కొద్ది సేపటి కిందటే దీన్ని ప్రారంభించారు.

రచ్చ రేపుతోన్న రేవంత్ రెడ్డి నియామకం: కేసీఆర్ విధేయులే టార్గెట్: వెల్‌కమ్ టు మధురై కోర్ట్రచ్చ రేపుతోన్న రేవంత్ రెడ్డి నియామకం: కేసీఆర్ విధేయులే టార్గెట్: వెల్‌కమ్ టు మధురై కోర్ట్

వనపర్తి జిల్లా తాడిపర్తిలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆమె పాల్గొన్నారు. దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగిస్తారు. ఈ సందర్భంగా తాడిపర్తికి చేరిన వైఎస్ షర్మిలను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, వైఎస్సార్టీపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెతో పాటు వైఎస్సార్టీపీ నాయకుడు పిట్ట రాంరెడ్డి, జిల్లా సమన్వయకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు.

YSRTP Chief YS Sharmila launched Nirudyoga Nirahara Deeksha at Wanaparthy

నిరుద్యోగులకు న్యాయం చేయడానికి తాము ఎంత వరకైనా పోరాడతామని అన్నారు. ఎవరితోనైనా తెగించి కొట్లాడతామని చెప్పారు. ఈ ప్రయత్నంలో తమకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా లెక్కచేయబోమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగాల నోటిఫికేషన్‌ను సాధిస్తామని చెప్పారు. 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిమాటగా చెప్పారని, దాన్ని తాము అంగీకరించబోమని అన్నారు. లక్షా 90 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు వెనుకంజ వేయబోమని చెప్పారు.

YSRTP Chief YS Sharmila launched Nirudyoga Nirahara Deeksha at Wanaparthy
  Importance Of Jeepneys In The Philippines, జీప్ డ్రైవర్ లైఫ్ ఇదీ || Oneindia Telugu

  ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడానికి కేసీఆర్ సర్కార్ అంగీకరించలేదని, అయినప్పటికీ తన ఇంటినే నిరాహార దీక్షా వేదికగా మార్చుకున్నానని వైఎస్ షర్మిల చెప్పారు. ఒక సామాజిక అంశం కోసం గొంతిత్తిన తనను తెలంగాణ ప్రభుత్వం తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద తమను అవమానించిందని మండిపడ్డారు. పోలీసులు తన చెయ్యిని విరగ్గొట్టారని గుర్తు చేశారు. ఇన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ- తాను వెనుకంజ వేయలేదని అన్నారు. 72 గంటల నిరాహార దీక్షను లోటస్ పాండ్ ఇంటి వద్ద కొనసాగించానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

  English summary
  YSR Telangana Party Chief YS Sharmila launched Nirudyoga Nirahara Deeksha at Tadiparti village in Wanaparthy district.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X