• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

‘చేత‌కాని స‌న్నాసి ముఖ్య‌మంత్రి మాకొద్దు’: కేసీఆర్‌, కేటీఆర్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పరామర్శించారు షర్మిల. వారి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.

 కేసీఆర్‌కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలే: షర్మిల ఫైర్

కేసీఆర్‌కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలే: షర్మిల ఫైర్

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలేనన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏడున్నరేళ్లలో 8 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్.. బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక కొందరు, యాసంగిలో వరి వద్దన్న కారణంగా మరి కొందరు మరణించారు. మరికొంత మంది రైతులు ధరణిలో భూమి కనిపించడం లేదని ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరందరి కుటుంబాలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్‌ చేశారు. రుణమాఫీ అని చెప్పి కేవలం 3 లక్షల మందికి రూ. లక్ష చొప్పున మాఫీ చేశారు. మరో 36 లక్షల మందికి రుణాలు ఎగ్గొట్టాడు అంటూ ధ్వజమెత్తారు. రైతు బంధు కింద ఎకరాకు రూ.5వేలు ఇచ్చి సంబురాలు చేసుకోవ‌డం సిగ్గుచేటని మండిపడ్డారు. . రైతు బంధుకు జై కొట్టి.. ఇన్‌పుట్ సబ్సిడీ నై, యంత్ర లక్ష్మి నై అంటున్నారని షర్మిల ఆరోపించారు.

సిగ్గుంటే సీఎం పదవికి రాజీనామా చేసేవారు: కేసీఆర్‌పై షర్మిల

సిగ్గుంటే సీఎం పదవికి రాజీనామా చేసేవారు: కేసీఆర్‌పై షర్మిల

వైయస్సార్ పాలనలో రైతులకు రుణమాఫీ చేశారని, ఉచిత విద్యుత్ అందించారన్నారు. వైయస్ఆర్ పాలనను మిగతా రాష్ట్రాలు అనుసరిస్తుంటే కేసీఆర్ మాత్రం.. నియంత పాలన సాగిస్తుడని షర్మిల దుయ్యబట్టారు. పరిపాలన చేతకాకే ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. ఏడేళ్లలో 7వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. కేసీఆర్ ఒక్కరిని పరామర్శించలేదన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనమని చెబుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని చెబుతుంది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే ఆ అంశాన్ని ఇరు పార్టీల లీడ‌ర్లు పక్కదారి పట్టించారన్నారు. పంట వేసుకునే హక్కు రైతుది. అది కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రైతులు ఎంత పండిస్తారో, అంతా కొనాల్సిందే. కొన్న ధాన్యాన్ని పక్క రాష్ట్రానికి అమ్ముతారో, పక్క దేశానికి అమ్ముతారో, రా రైస్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ కొనాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టని కేసీఆర్, హరియాణాలో చనిపోయిన రైతులకు మూడు రోజుల్లోనే మూడు లక్షలు ఇస్తాడట. వీరివి ప్రాణాలు కాదా ? వీరి బాధ్యత పట్టదా ? ముఖ్యమంత్రికి సిగ్గుంటే రాజీనామా చేసేవారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని షర్మిల డిమాండ్‌ చేశారు.

చేత‌కాని స‌న్నాసి ముఖ్య‌మంత్రి మాకొద్దు.. అంటూ షర్మిల నిప్పులు

చేత‌కాని స‌న్నాసి ముఖ్య‌మంత్రి మాకొద్దు.. అంటూ షర్మిల నిప్పులు

కేసీఆర్‌ నోరు విప్పితే బూతు పురాణం. సీఎం హోదాలో ఉండి గ‌ల్లీ లీడ‌ర్‌లా మాట్లాడుతున్నారని షర్మిల మండిపడ్డారు. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా సీఎం వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా?స‌మాజం ఆలోచించుకోవాలి. కేసీఆర్.. మాట‌లు చెప్పడం కాదు. మంచి ప‌నులు చేయ‌డం ముఖ్యం.. ప్రజల గుండెల్లో నిలిచిపోవడం ముఖ్యం. మీకు చైతనైతే అది చేయండి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మొనగాడు అయిపోరు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ భాష‌లోనే మేం మాట్లాడాలంటే మాకు చేత‌కాక కాదు. మాకు ఇంగిత‌జ్ఞానం ఉంది. ఈ రోజు చేత‌కాని ముఖ్యమంత్రి మాకొద్దని నినదిస్తున్నామన్నారు షర్మిల. కేసీఆర్ భాష‌లో చెప్పాలంటే చేత‌కాని స‌న్నాసి ముఖ్య‌మంత్రి మాకొద్దు.. ఉద్యోగాలు ఇ్వవడం చేత‌కాని స‌న్నాసి ముఖ్యమంత్రి మాకొద్దన్నారు షర్మిల. ఇక‌నైనా కేసీఆర్‌ ఆ ప‌ద‌వికి తగ్గట్టు , ఆ కుర్చీకి తగినట్టు మాట్లాడితే సమాజానికి బాగుంటుందన్నారు.

నిబంధనలు ప్రతిపక్షాలకేనా మీకు వర్తించవా.?: కేటీఆర్‌పై షర్మిల ఫైర్

నిబంధనలు ప్రతిపక్షాలకేనా మీకు వర్తించవా.?: కేటీఆర్‌పై షర్మిల ఫైర్

మొన్న కేటీఆర్ నల్లగొండలో కోవిడ్‌ రూల్స్‌ ఉల్లంఘించి ర్యాలీ తీశారు. ఆ త‌ర్వాత భారీ మీటింగ్ పెట్టారు. 25వ తేదీకి కొవిడ్ జీవో ఇచ్చి.. దానిని జ‌న‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. కేటీఆర్ మాత్రం 28వ తేదీన స‌భ నిర్వహించి, జీవో అమ‌లులో లేద‌ని అబ‌ద్దాలు చెబుతున్నారు. కొవిడ్ రూల్స్ టీఆర్ఎస్ లీడర్లకు వర్తించవా? ప్రతిపక్షాలకే వర్తిస్తాయా అంటూ ప్రశ్నించారు. రైతుల‌కు భ‌రోసా ఇచ్చేందుకు మేం రైతు ఆవేద‌న యాత్ర నిర్వహిస్తే అడుగడుగునా అడ్డుకున్నారు. ఆంక్షల పేరుతో ఇబ్బందులు పెట్టారు. మేం రూల్స్ ప్రకారమే యాత్ర నిర్వహిస్తామని చెప్పిన వినలేదు. పర్మిషన్‌ఇవ్వలేదని షర్మిల ఆరోపించారు. రూల్స్ పాస్ చేసేది టీఆర్ఎస్ లీడ‌ర్లే.. రూల్స్ బ్రేక్ చేసేది టీఆర్ఎస్ లీడ‌ర్లే. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే అధికారపార్టీ నాయకలుఉ ఆంక్షలు విధిస్తున్నారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్‌రావు కొడుకు, వ‌న‌మా రాఘ‌వ ఒక కుటుంబాన్ని పొట్టన పెట్టుకుని దర్జాగా బయట తిరుగుతున్నా అధికార పార్టీ ఏం చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ పోలీసుల‌ను ప‌ని వాళ్లలా వాడుకుంటున్నారు. మీరు ప్రజా సేవకులు సేవ‌కులు అనే విష‌యాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలన్నారు. కేటీఆర్ ఎవ‌రిని చెబితే వారిని అరెస్ట్ చేయ‌డం.. ప‌ర్మిష‌న్లు ఇవ్వకపోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి మంత్రులకు కాదు ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలని వైఎస్ షర్మిల హితవు పలికారు.

English summary
YSRTP leader YS Sharmila lashes out at telangana CM KCR and minister KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X