• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Sharmila పార్టీ పేరు మారిందా : అన్న దారిలోనే చెల్లి : సర్వే రిపోర్ట్ రెడీ..ఎన్ని సీట్లు వస్తాయంటే..!!

By Lekhaka
|

అచ్చం..అన్న పార్టీ ఏర్పాటు సమయంలో ఏం చేసారో...అదే..ఇప్పుడు షర్మిల చేస్తున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి..అప్పటికే రిజిస్టర్ అయి ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో ఉన్న పార్టీని జగన్ ఓన్ చేసుకున్నారు. తల్లి విజయమ్మను గౌరవాధ్యక్షురాలిగా నియమించారు. ఇక, ఇప్పుడు షర్మిల సైతం అదే తరహాలో...వైఎస్సార్టీపీ పేరుతో పార్టీ ప్రకటనకు రంగం సిద్దమైంది. ఇందు కోసం వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు తమకు పేరు విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఎన్వోసీ సైతం ఇచ్చేసారు. అయితే , అన్న జగన్..యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉంటే..చెల్లెలు షర్మిల ఇప్పుడు వైఎస్సార్టీపీ..చిన్న మార్పుతో పేరు ఖరారు చేసారు. యువ శక్తి రైతు తెలంగాణ పార్టీ గా పేరు ఖరారైనట్లు సమాచారం.

  YS Sharmila Party Name : సర్వే రిపోర్ట్.. ఎన్ని సీట్లు ? పార్టీ పేరు మారిందా..? || Oneindia Telugu

  ఇక, అన్న నమ్ముకున్న ప్రశాంత్ కిషోర్ టీం ను షర్మిల నమ్మారు. అయితే, నేరుగా ప్రశాంత్ కిషోర్ కాకుండా..ఆయన టీంలోని కీలక సభ్యురాలు..తమిళనాడులో ఒక మీడియా సంస్థ ఓనర్ గా ఉన్న ప్రియ ఇప్పటికే వ్యూహకర్తగా సేవలు ప్రారంభించారు. పార్టీ ప్రారంభోపన్యాసంలో చేర్చాల్సిన అంశాల పైన షర్మిలతో చర్చించారు. ఇక..పూర్తిగా జగన్ తరహాలోనే తండ్రి వారసురాలిగా తెలంగాణలో ..టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ కు పోటీ ఇస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేసి వైఎస్సార్ ను పూర్తిగా సొంతం చేసుకోవటంలో జగన్ సక్సెస్ అయ్యారు. షర్మిల ఏం చేస్తారనేది చూడాలి.

  YSRTP:Sharmila party flag and party name making rounds in social media, Know the specialities

  ఇదే సమయంలో షర్మిల పార్టీ అప్పుడే ఒక ప్రముఖ సర్వే సంస్థతో తెలంగాణలో సర్వే సైతం చేయించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఎన్ఫీసీ సంస్థ ఈ సర్వే చేసిందని చెబుతున్నారు. తెలంగాణలోని 119 స్థానాల్లో 72 స్థానాల్లో వైఎస్సార్ అభిమానుల ప్రభావం ఉందని తేల్చారు. నేషనల్ పొలిటికల్ కన్సెల్టెన్సీ చేసిన సర్వేలో సామాజిక సమీకరణాలు..కేసీఆర్ ను ఎదుర్కోగలరనే నమ్మకం కలిగించగలిగితే ఖచ్చితంగా ఈ 72 స్థానాల్లో వైఎస్సార్ అభిమానులే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని ఆ సర్వే తేల్చిందని చెబుతున్నారు. దీని కారణంగానే గతం కంటే భిన్నంగా రేవంత్ రెడ్డి సైతం వైఎస్సార్ పైన అభిమానం చూపుతున్నారని..ఎన్టీఆర్ - వైఎస్సార్ దేవుళ్లతో సమానమని ప్రచారం చేయటం వెనుక అసలు వ్యూహం ఆ ఇద్దరి అభిమానులను తాను ఓన్ చేసుకోవటమేనని తెలుస్తోంది.

  తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు పార్టీ పరంగా రేవంత్ తో నిలుస్తారా... వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు మద్దతిస్తారా అనేది రానున్న రోజుల్లో పాదయాత్రలు...పర్యటనలు...పార్టీ పైన ఆదరణ ద్వారా స్పష్టం కానుంది. దీంతో..ఇప్పుడు షర్మిల తెలంగాణలో వేస్తున్న ప్రతీ అడుగు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

  English summary
  YS Sharmila's new party is making rounds on social media and the party name is Yuvashakti rythu congress telangana party.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X