హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే నిజం.. కేంద్రం పాత్ర సున్నా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ 75 శ్రామిక్ రైళ్లలో దాదాపు లక్ష మంది వలస కూలీలను స్వస్థలాలకు తరలించిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకి రూ.6కోట్లు చెల్లించిందన్నారు. కూలీల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయలేదని.. మంచినీరు,భోజనానికి కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం పాత్ర సున్నా అని స్పష్టం చేశారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ఆయన స్పందించారు.

తెలంగాణలో చిక్కుకుపోయిన మేఘాలయ ప్రజలను తిరిగి అక్కడికి తరలించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సంగ్మా కర్నాడ్ ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారని మరో ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు మే 21వ తేదీన మేఘాలయకు ప్రత్యేక రైలు సర్వీసు ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇక ట్విట్టర్‌లో పలువురి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్.. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.

zero contribution from central to ferry migrant workers to their natives says ktr

Recommended Video

KCR Slams Centre’s Rs 20 Lakh Cr Package

సిరిసిల్ల నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన బండ లింగంపల్లి కుటుంబాన్ని పరామర్శించినట్టు మరో ట్వీట్‌లో కేటీఆర్ వెల్లడించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా పలు బ్రిడ్జిలు,కల్వర్టులు,ప్రభుత్వ కార్యాలయాలకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రాబోయే వానాకాలం నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.

English summary
Telangana minister KTR alleged that there is zero contribution from central government,ferrying migrant workers to their native states. It's strange,but its a fact that he added in his tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X