• search
  • Live TV
మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్: బట్టలు విప్పి వీడియో తీశారు -జోగిని శ్యామలపై మహిళ ఫిర్యాదు -జీరో ఎఫ్ఐఆర్ -భారీ ట్విస్ట్

|

తెలంగాణ సహా దేశమంతటా పాపులారిటీ కలిగిన కళాకారిణి, నటి, జోగిని శ్యామల మరో వివాదంలో కూరుకుపోయారు. జోగిని శ్యామలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్యామలపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును మెదక్ జిల్లాకు బదిలి చేశారు. విచారణ సాగుతుండగా, శ్యామల మీడియా ముందుకొచ్చి ట్విస్ట్ ఇచ్చారు. ఈ వివాదానికి సంబంధించి పోలసులు, శ్యామల పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి..

కిమ్ జాంగ్ మరో సంచలనం -నిద్ర పోవాలని లేదా? -బైడెన్‌కు యో వార్నింగ్ -భారత్‌కు రావాల్సి ఉండగాకిమ్ జాంగ్ మరో సంచలనం -నిద్ర పోవాలని లేదా? -బైడెన్‌కు యో వార్నింగ్ -భారత్‌కు రావాల్సి ఉండగా

 బట్టలు విప్పి వీడియో తీశారు..

బట్టలు విప్పి వీడియో తీశారు..

అభిమానంతో దగ్గరకు వెళితే, జోగిని శ్యామల నీచంగా ప్రవర్తించిందని స్రవంతి(26)అనే మహిళ ఆరోపించారు. బూతులు తిడుతూ, బలవంతంగా బట్టలు విప్పేసి, వీడియోలు తీశారని, శారీరకంగా ఇబ్బంది పెట్టడమేకాక, దాడికి కూడా పాల్పిందని ఆమె ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ గాంధీ నగర్‌కు చెందిన బాధితురాలు అసలు శ్యామలను ఎందుకు కలిసింది, తర్వాత ఏం జరిగిందనే విషయాలను కూడా వివరంగా చెప్పుకొచ్చింది..

 ఏడుపాయల జాతరలో..

ఏడుపాయల జాతరలో..

సికింద్రబాద్ కు చెందిన మహిళ, తన తల్లితో కలిసి ఈనెల మార్చి 12న మెదక్ జిల్లా ఏడుపాయల జాతరకు వెళ్లింది. నాగ్సాన్‌పల్లిలోని వనదుర్గ భవాని దేవి ఆలయంలో పూజల అనంతరం.. ఆలయ ప్రాంగణంలోనే జోగిని శ్యామలను కలిసింది. జోగిని అంటే అభిమానం ఉండటం వల్లే కలిశానని బాధితురాలు చెప్పింది. శ్యామల తాను ఉంటున్న ప్రదేశానికి రావాలని సదరు యువతి, ఆమె తల్లిని ఆహ్వానించింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరూ అక్కడకు వెళ్లారు. అక్కడ శ్యామలతో పాటు మరో 15 మంది యువకులు, హెల్పర్‌ ఉమ కూడా ఉన్నారు.

బూతులు తిడుతూ, బట్టలు విప్పి..

బూతులు తిడుతూ, బట్టలు విప్పి..

శ్యామల చెప్పిన ప్రదేశానికి వెళ్లగా, అక్కడున్న వారు మద్యం తాగుతున్నారని, బాటిల్ ఇచ్చి తాగాలని ఒత్తిడి చేశారని, అందుకు నిరాకరించే సరికి బూతులు తిడుతూ, బలవంతంగా దుస్తులు విప్పేసి, వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా బాధిత మహిళను, ఆమె తల్లిపై దాడి చేసి విపరీతంగా కొట్టి గాయపరిచారని పేర్కొంది. స్థానిక పోలీసులు అక్కడికి వచ్చి తమను కంట్రోల్ రూమ్‌కు తీసుకెళ్లారని, గాయాల వల్ల అపస్మారక స్థితిలోకి పోయి, డ్రైవర్ సాయంతో మార్చి 13వ తేదీ ఉదయం వరకు హైదరాబాద్ చేరుకున్నామని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 మెదక్ జిల్లాకు బదిలీ.. ట్విస్ట్..

మెదక్ జిల్లాకు బదిలీ.. ట్విస్ట్..

బాధిత మహిళ ఫిర్యాదు చేస్తే, తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే నిబంధనను తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్నదరిమిలా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జోగిని శ్యామలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘటన జరిగింది ఏడుపాయలలో కావడంతో కేసును మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి జోగిని శ్యామలను పోలీసులు విచారించాల్సి ఉండగా, మంగళవారం నాడు ఆమెనే మీడియా ముందుకొచ్చారు. బాధితురాలిగా ఉన్న మహిళ చెబుతున్నదంతా అబద్ధమని, దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయిన శ్యామల పేర్కొన్నారు.

పరువు తీయడానికే పన్నాగం

పరువు తీయడానికే పన్నాగం

మహిళపై దాడి చేసి, దుస్తులు చించి, వీడియో తీశానంటూ తనపై వస్తున్న ఆరోపణలను జోగిని శ్యామల ఖండిచారు. కేసు పెట్టిన మహిళ కూడా జోగినే అని, నిజానికి దాడికి పాల్పడింది ఆమెనే అని శ్యామల చెప్పారు. మద్యం తాగి వచ్చి స్రవంతి జాతరలో గొడవ సృష్టించిందని.. పోలీసులు అడ్డుకోగా, వారిపైనా దాడి చేసిందని, దీనికి సంబంధించి వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయని శ్యామల పేర్కొంది. తన ఎదుగుదల చూసి, పరువు తీయడానికి ఇవన్నీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది జోగిని శ్యామల. దీనిపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ -టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌ దిక్కు -జగన్ మాటే ఫైనల్: మంత్రి బాలినేనిచంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ -టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌ దిక్కు -జగన్ మాటే ఫైనల్: మంత్రి బాలినేని

English summary
Based on the complaint of a woman who alleged that Jogini Shyamala and her friends disrobed her and assaulted her in Medak district three days ago, Punjagutta police registered a zero FIR and transferred it to Medak Papannapet PS, on Monday. Jogini Shyamala denies charges against her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X