తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీటీడీలో కరోనా కల్లోలం.. కాసేపట్లో నిర్ణయం... జగన్ ఆర్డర్ కోసం వెయిటింగ్...

|
Google Oneindia TeluguNews

తిరుమలలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో అర్చకులలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. దీంతో టీటీడీ అర్చకులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే 18మంది అర్చకులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మెరుగైన వైద్య చికిత్స కోసం అర్ధరాత్రి చెన్నై అపోలోకు తరలించారు.

టీటీడీలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నా ఈవో మాత్రం దర్శనాలు కొనసాగించడంపై ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. అయితే ప్రభుత్వం ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉంది. కానీ దర్శనాలను మాత్రం కొనసాగిస్తోంది. టీటీడీ అధికారులతో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు తాజాగా పరిస్దితి తీవ్రం అవుతుండటంతో అధికారులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఎంవో నుంచి ఆదేశాలు వెలువడ్డాక టీటీడీ దీనిపై కాసేపట్లో ఓ ప్రకటన చేయనుంది.

after coronavirus spread ttd waiting for cm jagans nod to shutdown
English summary
tirumala tirupathi devasthanam board is wating for chief minister ys jagan's order to stop darshan and shutdown the temple amid growing coronavirus spread.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X