తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల సమాచారం: ఆర్జిత సేవా టికెట్లు విడుదల, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి 2020 ఏప్రిల్‌లో జరిగే విశేష ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. కరెంట్ బుకింగ్ కింద 54,600 ఆర్జిత సేవా టికెట్లు, ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,680 సేవా టికెట్లు, సుబ్రభాతం 7,920, విశేష పూజ 1500, కళ్యాణోత్సవం 12,825, తోమాల 140, అర్చన 140, అష్టాదళ పాదపద్మారాధన 180, వసంతోత్సవం 13,200, సహస్ర దీపాలంకరణ 15,600, నిజపాద దర్శనం 2,300 టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

లాటరీ విధానంలో ఎంపిక..

లాటరీ విధానంలో ఎంపిక..

శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలక్ట్రానిక్ లాటరీ విధానంలో భక్తులను టీటీడీ ఎంపిక చేస్తుంది. ఇది ఇలావుండగా, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్ తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే కార్యక్రమాల గురించి వివరించారు.

వైకుంఠ ఏకాదశి..

వైకుంఠ ఏకాదశి..

జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి :
జనవరి 6న ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వర్ణరథం, జనవరి 7న ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం జ‌రుగ‌నున్నాయి.
ప్రత్యేక దర్శనాలు నిలుపుదల :
జనవరి 5 నుండి 7వ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలను, గదులను కేటాయించడం లేదు.
జనవరి 5 నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, సుపథం మార్గంలో ప్రవేశించేవారికి ప్రత్యేక దర్శనాలు కేటాయించడం లేదు.
జనవరి 4 నుండి 8వ తేదీ వరకు దివ్యదర్శనం టోకెన్లు, టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు నిలుపుదల చేయడమైనది.
జనవరి 5 నుండి 8వ తేదీ వరకు అంగప్రదక్షిణ టోకెన్లు నిలుపుదల.

శ్రీవారి దర్శనం :

శ్రీవారి దర్శనం :


జనవరి 6న ఉదయం ధ‌నుర్మాస కైంక‌ర్యాల అనంత‌రం 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభం.
జ‌న‌వ‌రి 7వ తేదీ రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తాం.
జనవరి 5వ తేదీ ఉద‌యం నుండి భక్తులను క్యూలైన్ల‌లోకి అనుమతిస్తాం.
జ‌న‌వ‌రి 6న భ‌క్తుల‌కు పంపిణీ చేసేందుకు 3 ల‌క్ష‌ల తాగునీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచుకున్నాం.
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో 15 వేల మంది, మాడ వీధుల్లో 1.70 కోట్ల‌తో ఏర్పాటుచేసిన జ‌ర్మ‌న్ షెడ్ల‌లో 40 వేల మంది, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో రూ.26 కోట్ల‌తో నిర్మించిన షెడ్ల‌లో 30 వేల మంది క‌లిపి మొత్తం 85 వేల మందికి పైగా భ‌క్తులు చ‌లికి ఇబ్బందులు ప‌డ‌కుండా ఏర్పాట్లు.
24 గంటల పాటు ఘాట్‌ రోడ్లు :
భక్తుల సౌకర్యార్థం జనవరి 6న 24 గంటల పాటు ఘాట్‌ రోడ్లు తెరిచి ఉంచడం జరుగుతుంది.
జనవరి 7న తిరుమల నుండి తిరుపతికి వెళ్లే ఘాట్‌ రోడ్డు మాత్రమే తెరిచి ఉంచుతాం.

అన్నప్రసాద వితరణ :

అన్నప్రసాద వితరణ :


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో జనవరి 6న ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు, జనవరి 7న ఉదయం 7 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ.
డెప్యుటేషన్‌ సిబ్బంది :
భక్తులకు సేవలందించేందుకు 700 మంది డెప్యుటేషన్‌ సిబ్బంది సేవలు. వీరిలో 26 మందికి సెక్టోరియల్‌ అధికారులుగా బాధ్యతలు.
శ్రీవారి సేవకులు :
3,500 మంది శ్రీవారి సేవకులు, 1300 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో భక్తులకు సేవలు.
టిటిడి డైరీలు, క్యాలెండర్లు
ప్రింటింగ్ సంస్థ‌లు స‌కాలంలో చేర‌వేయ‌క‌పోవ‌డంతో డైరీలను స‌కాలంలో భ‌క్తుల‌కు అందించ‌లేక‌పోయాం. ఈసారి మ‌రింత ముందుగా టెండ‌ర్లు ఖ‌రారుచేసి ప్రింటింగ్ చేయిస్తాం. క్యాలెండ‌ర్లు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచాం.

ప్రత్యేక దర్శనాలు :

ప్రత్యేక దర్శనాలు :

జనవరి 21, 28వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తాం.
జనవరి 22, 29వ తేదీల్లో 5 ఏళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.
అనంత‌రం 2018, 2019 సంవ‌త్స‌రాల్లో న‌మోదైన వివ‌రాల‌ను ఈవో తెలియ‌జేశారు.
దర్శనం :
2018వ సంవ‌త్స‌రంలో 2.68 కోట్ల‌ మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 2019వ సంవ‌త్స‌రంలో 2.79 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం :
శ్రీవారి హుండీ ఆదాయం 2018లో రూ.1066.48 కోట్లు కాగా, 2019లో రూ.1161.74 కోట్లు వచ్చింది.
అన్నప్రసాదం :
2018లో 6.09 కోట్ల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, 2019లో 6.46 కోట్ల మంది భక్తులకు అందజేయడం జరిగింది.
లడ్డూలు :
2018లో 11.06 కోట్ల లడ్డూలు అందించగా, 2019లో 12.49 కోట్ల లడ్డూలను అందించాం.
గ‌దులు :
గ‌దుల ఆక్యుపెన్సీ 2018లో 99 శాతం న‌మోదు కాగా, 2019లో 106 శాతం న‌మోదైంది.

శ్రీవారి ఆలయాలు :

శ్రీవారి ఆలయాలు :


వైజాగ్‌లో రూ.17 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి ఆలయ నిర్మాణం పూర్త‌వుతుంది. మ‌రో రూ.5 కోట్లతో అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్నాం.
ముంబైలో దాత‌ల స‌హ‌కారంతో రూ.30 కోట్ల‌తో శ్రీ‌వారి ఆల‌యం నిర్మిస్తాం.
జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి అక్క‌డి ప్ర‌భుత్వం రెండు స్థ‌లాలను ఎంపిక చేసింది. టిటిడి అధికారుల బృందం వెళ్లి స్థ‌లాన్ని ఎంపిక చేసిన త‌రువాత ఆల‌య నిర్మాణం ప్రారంభిస్తామని ఈవో తెలిపారు.

English summary
TTD EO Sri Anil Kumar Singhal said, TTD has geared up for Vaikuntha Ekadasi on January 6 and Dwadasi on January 7 respectively. After Dial your EO programme at Annamaiah Bhavan on Friday, the EO said, all privilege darshans remain cancelled from January 5 to 7 along with Arjitha sevas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X