తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక ఏడుకొండ‌ల బాట‌..! నేడు శ్రీ‌వారిని ద‌ర్శించుకోనున్న వైసీపి చీఫ్ జ‌గ‌న్..!

|
Google Oneindia TeluguNews

తిరుమల : వైసీపి అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన మ‌హా క్ర‌తువు ముగిసింది. సుధీర్గ ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర నిన్న‌టితో శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముడిసింది. అత్యంత జ‌న వాహిని ముందు జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ముగిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక నేడు తిరుమ‌ల శ్రీ‌వారిని సంద‌ర్శించుకుని త‌న మొక్కును చెల్లించుకోబోతున్నారు వైసీపి అదినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం త‌ర్వాత రెండు రోజుల విశ్రాంతి అనంత‌రం మ‌ళ్లీ బ‌స్సు యాత్ర‌పై జ‌గ‌న్ పార్టీ ముఖ్య‌నేత‌లో స‌మీక్ష నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. పాద‌యాత్ర‌లో క‌వ‌ర్ చేయ‌లేని సుమారు 70కి వైగా నియోజ‌క వ‌ర్గాల‌ను జ‌గ‌న్ బ‌స్సు యాత్ర ద్వారా ప‌ర్య‌టిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు నిర్ధారిస్తున్నాయి.

jagan

సుదీర్ఘ పాదయాత్ర ముగించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిన్న ప్రజా సంకల్ప పాదయాత్ర ముగించిన జగన్ అక్కడి నుంచి నేరుగా తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి బయలుదేరారు. రైలు మార్గంలో ఈ రోజు ఉదయం రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అలిపిరి చేరుకుని కాలి నడకన తిరుమల చేరుకోనున్నారు.

సామాన్య భక్తుల దారిలోని మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వచనాలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం బయలుదేరి పులివెందుల వెళతారు. ఆ త‌ర‌వాత హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ కు జ‌గ‌న్ చేరుకో బోతున్నట్టు తెలుస్తోంది.

English summary
YS Jaganmohan Reddy, YSR Congress Party leader who is on a long trip in praja sankalpa yatra, will visit Tirumala on Thursday. Jagan, who completed the public yatra on Wednesday in the Srikakulam district, went straight to Thirumala Venkateshwara from Itchapuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X