తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీటీడీ బోర్డు ప్రకటన : కేసీఆర్ సిఫార్సులకు పెద్ద పీట : నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు స్థానం..!!

|
Google Oneindia TeluguNews

అనేక తర్జన భర్జనల తరువాత ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ కు ఈ బోర్డులో సభ్యులుగా అవకాశం ఇవ్వాలం టూ పెద్ద ఎత్తున రాజకీయంగా ఒత్తిడి వచ్చింది. మొత్తం 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసారు. అందులో తెలంగాణ నుండి ఏడుగురు...ఏపీ నుండి ఎనిమిది మందికి అవకాశం ఇవ్వగా.. తమిళనాడు నలుగురుని ఎంపిక చేారు. ఢిల్లీ నుండి ఒకరు.. కర్నాటక నుండి ముగ్గురును నియమించారు. మహారాష్ట్ర నుండి ఒకరికి అవకాశం దక్కింది. వీరు కాకుండా నలుగురు సభ్యులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ నుండి పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వరరావు పేరు ఖరారైంది. అదే విధంగా తమిళనాడు నుండి మరో పారిశ్రామిక వేత్త శ్రీనివాస్ ను అవకాశం దక్కింది.

ఏపీ నుండి 8మంది సభ్యులు
టీటీడీ బోర్డులో ఏపీ నుండి 8 మంది సభ్యులు నియమితులయ్యారు. అందులో నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి సతీమణి ప్రశాంతి అవకాశం దక్కించుకున్నారు. యలమంచిలి ఎమ్మెల్యే రమణ మూర్తి రాజు..కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి.. పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబు రావు.. స్వామి స్వరూపానంద సిఫార్సు మేరకు నాదెండ్ల సుబ్బారావు, డిపి అనంత, సీనియర్ నేత కె పార్దసారధి.. చిప్పగిరి ప్రసాద కుమార్ పేర్లను ఎంపిక చేసారు. అదే విధంగా ఢిల్లీ నుండి ఎమ్మెస్ శివ శంకరన్ పేరు ఎంపిక చేసారు, మహారాష్ట్ర నుండి రాజేశ్ శర్మ పేరను జగన్ ఖరారు చేసారు. కర్నాటక నుండి రమేష్ శెట్టి.. సంతప్ రవి నారాయణ్.. గత బోర్డులోనూ సభ్యురాలిగా ఉన్న సుధా నారాయణ మూర్తికి తిరిగి అవకాశం దక్కింది. ఇక, ఎక్స్ అఫీషియో సభ్యులుగా తుడా ఛైర్మన్ హోదాలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి, దేవాదాయ శాఖ పత్యేక కార్యదర్శి.. దేవాదాయ శాఖ కమిషనర్.. టీటీడీ ఈవో సింఘాల్ సభ్యులుగా ఉంటారు.

AP Govt nominate TTD board with 28 members. CM Jagan given priority for KCR Reccomanded names

కేసీఆర్ సిఫార్సులకు పెద్దపీట..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సిఫార్సులకు ఏపీ సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా..పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు, బి పార్ధసారధి రెడ్డి, యు వెంకట భాస్కర రావు , సిద్దిపేట కు చెందిన మూరంశెట్టి రాములు..డి దామోదర రావు..వైసీపీ పార్టీ వ్యవస్థాపకుడు డి శివకుమార్.. వైసీపీ నేత పుట్టా ప్రతాప్ రెడ్డి లను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. ఇక, తమిళనాడు నుండి నలుగురు సభ్యులు ఎంపికయ్యారు. అందులో ఎమ్మెల్యే కుమారగురు.. డాక్టర్ నిచిత ముత్తవరపు, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, క్రిష్ణమూర్తి వైద్యనాధన్ కు అవకాశం దక్కింది. వీరంతా ఒకటి లేదా రెండు రోజుల్లో బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

English summary
AP Govt nominate TTD board with 28 members. CM Jagan given priority for KCR Reccomanded names in this board. Eight members from AP and & members from Telangana got hance in Board. Tamilnadu..karnataka, maharashtra and Delhi alos got chance in TTD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X