• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీటీడీ బోర్డు సభ్యత్వం కోసం పోటాపోటీ: ఆ కేంద్రమంత్రుల సిఫారసు లెటర్లు

|

తిరుపతి: రాష్ట్రంలో అన్ని నామినేట్ పదవులతో పోల్చుకుంటే- తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న డిమాండ్ అధికం. కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో వెలిసిన శ్రీవారిని దర్శించడానికి వచ్చే కోట్లాదిమంది భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో కీలక పాత్ర పోషించే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా వ్యవహరించడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు. పాలక మండలి సభ్యత్వానికి ఉన్న డిమాండూ అదే రేంజ్‌లో ఉంటుంది. ఇందులో సభ్యత్వం పొందడానికి ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు.

వివాదరహితులకు మాత్రమే..

వివాదరహితులకు మాత్రమే..


జగన్ సర్కార్.. ప్రస్తుతం టీటీడీకి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయాల్సి ఉంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి వరుసగా రెండోసారి టీటీడీ పాలక మండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. సభ్యులను ఇంకా నియమించాల్సి ఉంది. ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివాదరహితంగా కొత్త పాలక మండలి సభ్యులను అపాయింట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొందరు ఆశావహులతో ఓ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాను మళ్లీ వడపోయాల్సి ఉందని చెబుతున్నారు.

SaraAliKhan: బికినీ తో మాల్దీవులో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు .. (ఫొటోస్)SaraAliKhan: బికినీ తో మాల్దీవులో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు .. (ఫొటోస్)

40కి పైగా

40కి పైగా

ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలు, వేర్వేరు రంగాలకు చెందిన వారిని సాధారణంగా- టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమితులవుతుంటారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూనే- సభ్యుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 60 నుంచి 70 మందితో కూడిన ఓ జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీన్ని వడపోసి 40కి తగ్గించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అందిన సిఫారసుల మేరకు ఈ లిస్ట్ ప్రిపేర్ అయిందని అంటున్నారు.

PoonamBajwa: థైస్ అందాలతో రెచ్చిపోతున్న నాగ్ హీరోయిన్..PoonamBajwa: థైస్ అందాలతో రెచ్చిపోతున్న నాగ్ హీరోయిన్..

సెలెక్టివ్ కేంద్రమంత్రులకు..

సెలెక్టివ్ కేంద్రమంత్రులకు..


ఈ పరిస్థితుల మధ్య పలువురు కేంద్రమంత్రులు కూడా రెకమండేషన్ లెటర్లను ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. 10 నుంచి 15 మంది వరకు కేంద్రమంత్రులు ఈ సిఫారసు లేఖలను పంపించారని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకు తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కలిసిన కేంద్రమంత్రులు సైతం ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. టీటీడీ పాలక మండలి సభ్యత్వం కోసం తమవారి పేర్లను సూచించాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు- కొందరు ఎంపిక చేసిన కేంద్రమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

నో.. పాలిటిక్స్

నో.. పాలిటిక్స్

నామినేట్ పదవి కావడం, పైగా శ్రీవేంకటేశ్వర స్వామివారిని సేవ చేసుకునే అవకాశం ఉండటం వల్ల దీన్నీ కేంద్రమంత్రులు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ రాజకీయ కోణంలో చూడట్లేదని అంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేని పాలక మండలి కావడం వల్ల కేంద్రమంత్రులు- బీజేపీ అధిష్ఠానంతో గానీ, రాష్ట్రశాఖ నాయకులతో గానీ ఎలాంటి సంప్రదింపులు జరపట్లేదని, నేరుగా తమ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

రాష్ట్ర ప్రయోజనాల కోసం..

రాష్ట్ర ప్రయోజనాల కోసం..

టీటీడీ పాలక మండలి పదవుల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలనే అభిప్రాయం సైతం ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఉన్నట్లు చెబుతోన్న జీఎస్టీ బకాయిలు, పోలవరం నిధులు, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల, ఆర్ధిక చేయూతను దృష్టిలో ఉంచుకుని కొందరు ఎంపిక చేసిన కేంద్రమంత్రులను టీటీడీ బోర్డు సభ్యత్వ పదవి కోసం పేర్లను సిఫారసు చేయాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు.

తోటి రాష్ట్రాల నుంచీ..

తోటి రాష్ట్రాల నుంచీ..

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పలు పేర్లు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఫారసు చేసిన వారి జాబితాకు అనుగుణంగా పాలకమండలి సభ్యుల సంఖ్యను కూడా పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించే అవకాశాలు లేకపోలేదు. తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు కేసీఆర్, ఎం కే స్టాలిన్‌తో ఏపీ ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నాయి.

  'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu
  సంఖ్య పెరగొచ్చు..

  సంఖ్య పెరగొచ్చు..

  అలాగే- కర్ణాటక ప్రభుత్వంతో కూడా. వారి నుంచి అందిన సిఫారసులు యధాతథంగా అంగీకరించాల్సి వస్తే- బోర్డు సభ్యుల సంఖ్య పరిమితిని దాటుతుంది. అందుకే- ఈ జాబితాలో కొందరు ముఖ్యులను మాత్రమే- పాలక మండలి సభ్యత్వాన్ని కల్పించి, మిగిలిన వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా- ఈ దఫా ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య ఇదివరకటి కంటే అధికంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

  English summary
  As many as central ministers reportedly recommend for TTD board membership for their followers.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X