• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతి ఉప ఎన్నిక: బరిలో బీజేపీ -అధికారిక ప్రకటన -పవన్ చెవిలో మళ్లీ కమలం పువ్వు

|

రాజకీయ పొత్తుల్లో పట్టువిడుపులకు సంబంధించి మిత్రులతో గట్టిగా వాదించడంలో వకీల్ సాబ్ మళ్లీ విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది తామేనని హరిహర వీరమల్లు స్థాయిలో ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ హైకమాండ్‌తోనూ తలపడినంత పనిచేశారు. స్నేహం కోసం తాను చేసిన త్యాగాలకు గుర్తుగా తిరుపతిలో పోటీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ జనసేనానికి మళ్లీ నిరాశే ఎదురైంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అధికారిక ప్రకటన చేసింది..

ys sharmila పార్టీలోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న -కాంగ్రెస్‌కు మరో షాక్ -రేవంత్ రెడ్డికి పీసీసీపై కామెంట్స్ys sharmila పార్టీలోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న -కాంగ్రెస్‌కు మరో షాక్ -రేవంత్ రెడ్డికి పీసీసీపై కామెంట్స్

తిరుపతి బరిలో బీజేపీనే

తిరుపతి బరిలో బీజేపీనే

వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఎస్సీ రిజర్వుడు స్థానమైన తిరుపతి లోక్ సభ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, ఏపీలో మిత్రులుగా కొనసాగుతోన్న బీజేపీ, జనసేనలు ఈ సీటులో పోటీ కోసం తీవ్రంగా పొటీపడ్డారు. పోటీలో ఉండేది మేమంటే మేమేనంటూ రెండు పార్టీల అధ్యక్షులూ పోటాపోటీ ప్రకటనలు ఇచ్చారు. చివరికి ఢిల్లీలో జరిగిన పంచాయితీలో.. ఎవరు పోటీ చేయాలనేదానిపై ఓ జాయింట్ కమిటీ ఏర్పాటైంది. రెండునెలల సుదీర్ఘ మంతనాల తర్వాత కమిటీ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీనే బరిలోకి దిగాలని, వారికి జనసేన మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నాయి. దీనిపై

పవన్‌తో భేటీ తర్వాత..

పవన్‌తో భేటీ తర్వాత..

ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజులు శుక్రవారం జనసేనాని పవన్ కల్యాణ్ తో తుది భేటీ నిర్వహించిన అనంతరం తిరుపతి సీటుపై మీడియాకు స్పష్టత ఇచ్చారు. ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉంటారని, మిత్రపక్షంగా జనసేన మద్దతు కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. తిరుపతి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పవన్ కు నిరాశే ఎదురైనట్లయింది..

ఎన్నికలు ఎప్పుడంటే..

ఎన్నికలు ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నగారా మోగించింది. ప్రస్తుతం జరుగుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటే తిరుపతి ఎంపీ సీటుకూ ఉప ఎన్నిక నిర్వహిస్తామన్న ఈసీ.. ప్రక్రియ తేదీలను అతి త్వరలోనే ప్రకటించనుంది. ఏపీలోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.

రైల్వేలో రూ.లక్ష కోట్లు ప్రైవేటు చేతికి -ఆస్తుల అమ్మకంలో మోదీ సర్కార్ జోరు -శాఖలవారీగా టార్గెట్లు ఇవేరైల్వేలో రూ.లక్ష కోట్లు ప్రైవేటు చేతికి -ఆస్తుల అమ్మకంలో మోదీ సర్కార్ జోరు -శాఖలవారీగా టార్గెట్లు ఇవే

జీహెచ్ఎంసీ త్యాగం వృధానేనా?

జీహెచ్ఎంసీ త్యాగం వృధానేనా?

గతేడాది చివర్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు ప్రకటించడం ద్వారా పవన్ కల్యాణ్ సంచలనం రేపారు. జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రన జనసేనకు సొంత అస్థిత్వం ఉండదా? అంటూ ఎదురు ప్రశ్నలు సంధించిన ఆయన.. జీహెచ్ఎంసీలో అభ్యర్థులను కూడా ప్రకటించారు. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి బుజ్జగించిన తర్వాత పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ సందర్భంలో.. జీహెచ్ఎంసీలో త్యాగానికి ప్రతిఫలంగా తిరుపతిలో పోటీకి జనసేనకు అవకాశం కల్పించాలని బీజేపీ పెద్దలను కోరుతానని పవన్ స్వయంగా ప్రకటించారు. కానీ చివరికి ఆ సీటులోనూ బీజేపీనే బరిలోకి దిగడం ఖరారైంది. దీంతో ఆయనకు మళ్లీ చెవిలో పువ్వే గతైందనే కామెంట్లు వస్తున్నాయి.

తిరుపతిలో బీజేపీ అభ్యర్థి ఎవరు?

తిరుపతిలో బీజేపీ అభ్యర్థి ఎవరు?

ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో జనసేన మద్దతుతో బీజేపీ పోటీ చేయనుండటం ఖరారైనప్పటికీ, అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు. సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ అందరికన్నా ముందుగా ఉప ఎన్నిక అభ్యర్ధిని ప్రకటించి షాకిచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే మళ్లీ బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు. టీడీపీ అభ్యర్ధిని ప్రకటించిన కొన్ని రోజులకే అధికార వైసీపీ కూడా అనూహ్యంగా ఉప ఎన్నిక బరిలో కొత్త అభ్యర్ధిని నిలుపుతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వైసీపీ తరఫున తిరుపతి టికెట్ బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్‌ చక్రవర్తికి వస్తుందని అందరూ భావించారు. కానీ కళ్యాణ్‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి....తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తికి టికెట్ కేటాయించారు సీఎం జగన్‌. ఈ కేటాయింపుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

English summary
BJP to contest Tirupati loksabha bypoll. Janasena to support as alliance partner. the Decision comes after extensive talks between the two sides. after months of discussion bjp and its ally janasena came to an understanding on tirupati loksabha by election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X